Begin typing your search above and press return to search.
అమ్మో బొమ్మలా ఉంది.. ఏంటీ ఈ షాక్ లు కాజల్?
By: Tupaki Desk | 21 Feb 2021 9:00 AM ISTచందమామ కాజల్ వరుస ఫోటోషూట్లు మతి చెడగొడుతున్నాయి. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ మరింతగా చెలరేగిపోతోంది. ఓవైపు హబ్బీ కిచ్లు కిచెన్ బిజినెస్ కి కావాల్సినంత ప్రమోషన్ చేస్తున్న కాజల్ మరోవైపు ఇన్ స్టా మాధ్యమంగా ఫోటోషూట్లను షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
ఇదివరకూ కాజల్ షేర్ చేసిన ఫోటో చూడగానే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం. చూడటానికి కాంస్య విగ్రహమా లేక పుత్తడితో తయారు చేసిన బొమ్మా! అంటూ అభిమానులు షాక్ తిన్నారు. ఇది స్పెషల్ డిజైనర్ లుక్. మేకప్ విధానం అలా మెటాలిక్ గా ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు దానికి కొనసాగింపు. ఇవి చూడటానికి `అమ్మో బొమ్మ` అన్నట్టుగానే కనిపిస్తోంది.
ఇంతకుముందు సింగపూర్ లో లాంచ్ చేసిన మైనపు విగ్రహం పక్కనే తన రియాలిటీ ఫోటోషూట్ ని ఉంచితే ఇది కూడా విగ్రహమేనని యాత్రికులు కంగారు పడటం ఖంగు తినడం ఖాయమేనేమో!! ఇటీవలే లైవ్ టెలీకాస్ట్ అనే హారర్ వెబ్ సిరీస్ లో నటించింది కానీ జనానికి పెద్దగా కనెక్టవ్వలేదు. వెంకట్ ప్రభు ప్రయత్నం విఫలమైందన్న విమర్శలొచ్చాయి. కాజల్ వెబ్ ఎంట్రీ బాలేదని ట్రోల్ చేశారు ఫ్యాన్స్ అయితే. కాజల్ తదుపరి ఆచార్య చిత్రీకరణ ముగించి రిలీజ్ కి రాకుండా పెండింగులో ఉన్నవాటిని రిలీజ్ చేయించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో పారిస్ పారిస్ ఒకటి.