Begin typing your search above and press return to search.

అక్కడ కాజల్‌ టైం ఇంకా నడుస్తూనే ఉందే

By:  Tupaki Desk   |   23 Aug 2019 9:42 AM IST
అక్కడ కాజల్‌ టైం ఇంకా నడుస్తూనే ఉందే
X
తెలుగులో 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో పరిచయం అయిన ముంబయి ముద్దుగుమ్మ కాజల్‌ చందమామ చిత్రం నుండి వెను తిరిగి చూడకుండా కెరీర్‌ లో దూసుకు వచ్చింది. టాలీవుడ్‌ లోని దాదాపు అందరు యంగ్‌ స్టార్‌ హీరోలతో చిన్న హీరోలతో సినిమాలు చేసేసింది. దాదాపుగా దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌ లో దుమ్ము రేపింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్‌ కలిసి రావడం లేదు. ఇటీవలే ఈమె శర్వానంద్‌ తో కలిసి నటించిన 'రణరంగం' చిత్రం నిరాశ పర్చింది. ఆ చిత్రంలోని కాజల్‌ పాత్రపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. టాలీవుడ్‌ లో ఈమె టైం అయిపోయిందంటూ టాక్‌ వస్తుంది. ఇలాంటి సమయంలో కోలీవుడ్‌ లో మాత్రం ఈమె టైం నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఇటీవలే కాజల్‌ తమిళంలో నటించిన 'కోమాలి' చిత్రం విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా సక్సెస్‌ ఫుల్‌ గా దూసుకు పోతున్న సమయంలోనే ప్యారీస్‌ ప్యారీస్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. సెన్సార్‌ కార్యక్రమాల విషయంలో కాస్త ఇష్యూ జరుగుతున్నా త్వరలోనే ఆ చిత్రం కూడా విడుదలై కాజల్‌ కు మరో సక్సెస్‌ ను తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే ఈమె సూర్య నటించబోతున్న 39వ చిత్రంలో హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌ లో మాట్రాన్‌ వచ్చింది. ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే. తాజాగా సూర్య - చిరుత శివల కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్‌ గా ఎంపికయ్యింది. ఇప్పటికే మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ 'ఇండియన్‌ 2' చిత్రంలో కూడా కమల్‌ హాసన్‌ కు జోడీగా నటించే అవకాశం ఈమెకు దక్కింది. ప్రస్తుతం తమిళనాట క్రేజీ ప్రాజెక్ట్‌ ల్లో నటించడంతో పాటు వరుసగా సక్సెస్‌ లు అందుకుంటుంది. అందుకే కోలీవుడ్‌ లో ఈ అమ్మడి టైం నడుస్తుందని అంటున్నారు. అక్కడ ఎంత కాలం వరకు ఈమె టైం నడవనుందో చూడాలి.