Begin typing your search above and press return to search.

బుధవారం నుండి కాజల్ 'పక్కా లోకల్'

By:  Tupaki Desk   |   15 Aug 2016 10:16 AM IST
బుధవారం నుండి కాజల్ పక్కా లోకల్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జనతా గ్యారేజ్. రీసెంట్ గా ఈ మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఆల్బంలో వినిపించిన అన్ని పాటలకు సాంగ్ ప్రోమోలు వదిలారు కానీ.. పక్కా లోకల్ అంటూ సాగే ఓ పాటకు మాత్రం ఎటువంటి విజువల్స్ చూపలేదు. వింటుంటేనే ఇదో ఐటెమ్ సాంగ్ అనే విషయం అర్ధమవుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ పాట షూటింగ్ ప్రారంభించకపోవడమే.. సాంగ్ ప్రోమో వదలకపోవాడనికి కారణంగా తెలుస్తోంది.

ఈ బుధవారం నుంచి 20వ తేదీ వరకూ.. ఈ ఐటెం సాంగ్ పిక్చరైజేషన్ చేయనున్నారు. ఇందులో ఐటెం భామగా కనిపించనున్నది ఎవరో తెలుసా? టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. మొదటిసారిగా ఐటెం సాంగ్ చేస్తోంది. ఇప్పటికే ఆడియో సాంగ్ కి విపరీతమైన క్రేజ్ రావడంతో.. వీడియోలో కాజల్ అందాలను పెర్ఫామెన్స్ ను ఊహించేసుకుని మరీ సంతోషించేస్తున్నారు. కాజల్ తో కలిపి 5 రోజుల షూటింగ్ చేశాక.. ఈ నెల 20న పాట చిత్రీకరణతో.. జనతా గ్యారేజ్ షూటింగ్ పూర్తయిపోనుందని తెలుస్తోంది.

ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో.. పక్కాలోకల్ ఐటంకు బాగా క్రేజ్ వచ్చింది. ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన సీజీ- డబ్బింగ్ పనులు పూర్తయిపోగా.. ఇప్పుడు సెకండాఫ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 2న భారీ ఎత్తున రిలీజ్ కానుంది జనతా గ్యారేజ్.