Begin typing your search above and press return to search.

కాజలూ.. చంపేస్తున్నావే!

By:  Tupaki Desk   |   3 Nov 2017 10:30 AM IST
కాజలూ.. చంపేస్తున్నావే!
X
వయసు తగ్గినా వన్నె తగ్గకపోవడం అనే మాట కాజల్ అగర్వాల్‌ను చూసే అనాలి. తనతో పాటుగా హీరోయిన్లయిన వాళ్లందరూ గ్లో కోల్పోయి ఎబ్బెట్టుగా తయారయ్యారు. చాలామంది సినిమాలే చాలించేశారు. కానీ కాజల్ మాత్రం ఇప్పటికీ అగ్ర కథానాయికగా కొనసాగుతూ.. గ్లామర్ కాపాడుకుంటూ అభిమానుల్ని అలరిస్తోంది. ఈ మధ్యే వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’లో కాజల్ ఎంత అందంగా కనిపించిందో చూశాం.

ఇప్పుడామె తన కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన సినిమాలో నటిస్తోంది. ఆమె తొలిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. అదే.. ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా పారిస్‌కు వెళ్లిన కాజల్.. అక్కడి నుంచి ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అది చూసి కుర్రాళ్ల మతులు పోతున్నాయి. నన్ను చూడు.. ఇప్పటికీ నవనవలాడుతున్న నా అందం చూడు అన్నట్లుగా పోజు ఇచ్చింది కాజల్. ఈ ఫొటో చూస్తే ఈ తరం హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపే అన్నట్లే ఉంది. కాజల్‌ను ఇలా చూశాక.. ఆమెకు ఇంకో మూణ్నాలుగేళ్లు ఢోకా లేదనే అనిపిస్తోంది.