Begin typing your search above and press return to search.

సర్దార్ సర్దేశాడు.. మహేష్ ఏం చేస్తాడో!!

By:  Tupaki Desk   |   13 April 2016 1:00 AM IST
సర్దార్ సర్దేశాడు.. మహేష్ ఏం చేస్తాడో!!
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు టీవీ ఛానల్స్ లో తెగ సందడి చేస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్స్ కోసం బోలెడన్ని కబుర్లు చెబుతోంది. సినిమా తనకు విపరీతంగా నచ్చిందని, ఫ్యాన్స్ తో కలిసి సర్దార్ చూసినపుడు తెగ ఎంజాయ్ చేశానంటోంది కాజల్. నిజానికి కాజల్ సర్దార్ గబ్బర్ సింగ్ పై చాలానే ఆశలు పెట్టుకుంది.

ఇక అమ్మడి కెరీర్ ఆఖరి దశకు వచ్చేసింది అనుకున్న టైంలో పవన్ నుంచి సర్దార్ కోసం పిలుపు వచ్చింది. తీరా థియేటర్లలో సర్దార్ నిరాశపరిచేశాడు. అందుకే అంతో ఇంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇంటర్వ్యూలతో కబుర్లు చెబుతోంది. ఎన్ని చెప్పినా.. ఇప్పటికైతే చందమామ చేతిలో ఉన్న తెలుగు సినిమా మరొక్కటే. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవం. మే నెలలో విడుదల కానున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితేనే.. కాజల్ కెరీర్ టాలీవుడ్ లో కంటిన్యూ అవుతుంది.

బ్రహ్మోత్సవం అసలే మహేష్ బాబు మూవీ. పైగా ముగ్గురు హీరోయిన్లు. సమంత - ప్రణీతలతో పాటు తను కూడా ఓ హీరోయిన్ గా చేస్తోందంతే. ఇందులో కాజల్ పాత్రకు గుర్తింపు రావడం అంటే ఆషామాషీ కాదు. ఒకవేళ బ్రహ్మోత్సవం నిరాశపరిచినా.. అందులో కాజల్ పాత్ర పండకపోయినా. ఇక స్టార్ హీరోలను మర్చిపోయి చిన్నాచితకా సినిమాలతో కాలం వెళ్లబుచ్చాల్సిన పరిస్థితి కాజల్ కు ఏర్పడుతుంది.