Begin typing your search above and press return to search.

గ్యారేజ్ లో అందరికంటే మేలు జరిగింది ఎవరికి?

By:  Tupaki Desk   |   6 Sept 2016 10:08 AM IST
గ్యారేజ్ లో అందరికంటే మేలు జరిగింది ఎవరికి?
X
జనతా గ్యారేజ్ కలెక్షన్ల విషయంలో శరవేగంగా దూసుకుపోతూ కేవలం నాలుగు రోజుల్లోనే 50కోట్ల మార్కుని అందుకుని రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా ద్వారా ఎవరికి ఎక్కువ మేలు జరిగిందా అన్న విశ్లేషణకి వస్తే...

కొరటాల శివ ఈ సినిమాతో దర్శకుడిగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. అయితే మిర్చి - శ్రీమంతుడు సినిమాలకు లభించిన అప్లాజ్ ఈ చిత్రానికి దక్కలేదన్నది వాస్తవం. ఇక హీరోయిన్లు సమంతా - నిత్యామీనన్ ల పాత్ర సినిమాలో అంతంతమాత్రమే. సాధారణంగా కొరటాల సినిమాలో విజృంభించే దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాలో అంచనాలకు తగ్గ అవుట్ ఫుట్ ఇవ్వలేదనే చెప్పాలి. ఇక తారక్ గత మూడు నాలుగు సినిమాలుగా పాత్రలను ఎంచుకుంటూ అద్భుతమైన నటన కనబరుస్తూ ప్రేక్షకుల మెప్పుని పొందుతున్నాడు. ఈ సినిమాలో కూడా తన సాగా కంటిన్యూ చేశాడు. అయితే వీరందరికంటే ఎక్కువ లాభపడ్డది మాత్రం ఐటెం సాంగ్ చేసిన కాజల్ అనే చెప్పాలి.

వరుసపరాజయాలతో కెరీర్ ని డల్ ఫేస్ లో కొనసాగిస్తున్న కాజల్ ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించడమనే క్లిష్టమైన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. అయితే దీని అవుట్ ఫుట్ ఆశించిన దానికంటే ఎక్కువ రావడంతో కాజల్ అమితానందంలో వుంది. తనలో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని నిరువుపించింది. చిరు 150వ సినిమాలో హీరోయిన్ గా తన ఎంపిక కరెక్టేననే అభిప్రాయం కూడా సంపాదించుకుంది.