Begin typing your search above and press return to search.

ఒకే నెలలో రెండు సార్లు ప్రెగ్నెన్సీ

By:  Tupaki Desk   |   25 Aug 2017 9:58 AM IST
ఒకే నెలలో రెండు సార్లు ప్రెగ్నెన్సీ
X
ప్రస్తుత రోజుల్లో గ్లామర్ షో లతో అదరగొడుతున్న హీరోయిన్స్ అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మకమైన పాత్రలను చేస్తూ.. మెప్పిస్తున్నారు. ఒకే సినిమాలో ఓ వైపు స్టైలిష్ లుక్స్ తో కొంచెం ఘాటుగా కనిపించి మరోవైపు హృదయాలకు హత్తుకునే పాత్రలను చేస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు అందాల భామ కాజల్ అగర్వాల్ కూడా అదే స్థాయిలో నటిస్తూ మెప్పిస్తోంది. ఒకే నెలలో రెండు సార్లు ప్రెగ్నెన్సీ తో కనిపించి అలరించింది.

మీరేదో ఉహించుకోకండి.. ఆమె ప్రెగ్నెన్సీతో కనిపించింది సినిమాల్లో. ఈ నెలలో ఆమె హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ రెండు చిత్రాల్లో కాజల్ ప్రెగ్నెన్సీతో కనిపించి అమ్మతనాన్ని తెరపై చక్కగా చూపించింది. మొదట రానా - తేజ కాంబినేషన్ లో వచ్చిన " నేనే రాజు నేనే మంత్రి" సినిమాలో జోగేంద్ర భార్యగా.. ఒక గర్భిణీ స్త్రీగా.. చక్కని నటనతో హృదయాలను తాకింది. ఇక తమిళ్ లో వచ్చిన "వివేగం" సినిమాలో కూడా కాజల్ అజిత్ కి భార్యగా నటించి క్లైమాక్స్ లో పురిటినొప్పులతో బాధపడుతూ ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఈ సినిమాలో కూడా కాజల్ చక్కగా తన పాత్రను ఆవిష్కరించింది. ఈ విధంగా కాజల్ రెండు సినిమాల్లో తన గ్లామర్ ఇమేజ్ ని పక్కనపెట్టి ఒక గర్భిణి స్త్రీ గా కనిపించి ఆకట్టుకుంది.

మరోవైపు కాజల్ తాను ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానంటూ వస్తున్న వార్తలను ఖండిస్తోంది. గతంలో ఎంత అడిగానో అంతే అడుగుతున్నానని.. తనకు ఎంతిస్తే కరక్టో అంతే ఇస్తున్నారని చాలా డిప్లమాటిక్ గా చెప్పేసింది. అది సంగతి.