Begin typing your search above and press return to search.

ప్చ్!! కాజల్ ని అక్కా అనేశాడు

By:  Tupaki Desk   |   1 Feb 2018 10:34 AM IST
ప్చ్!! కాజల్ ని అక్కా అనేశాడు
X
టాలీవుడ్ లో గత కొంత కాలంగా హాట్ చందమామ అని పిలవబడే కాజల్ అగర్వాల్ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై కనిపించినా బయట కనిపించినా అమ్మడి అందంలో పెద్దగా తేడా ఉండదు. దీంతో కుర్రకారు ఆమె ఏదైనా సినిమా వేడుకలకి రాబోతోందంటే చాలు ఎగబడి మరి వెళతారు. స్టార్ హీరోలు పక్కన ఉన్నా కూడా కాజల్ వైపు తెలియకుండా కళ్లు వెళ్లడం కామన్.

అలాంటి కాజల్ అంటే అందరికి కలల రాకుమారే. అయితే ఆమె అందం గురించి తెలిసిన వారు ఎవరైనా సరే సిస్టర్ అని అనరు. కానీ రీసెంట్ గా ''అ!'' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక అభిమాని మాత్రం కాజల్ ని అక్కా అని అనేశాడు. అతను ఏ ఫీలింగ్ తో అన్నాడో గాని కాజల్ ఆశ్చర్యపోయింది. అంతే కాకుండా ఐ లవ్ యు అనడంతో మరోసారి కాజల్ ఆశ్చర్య పోయి.. అక్కా అంటున్నవ్ మళ్ళీ ప్రపోజ్ చేస్తున్నావ్ ఏంటి అని నవ్వుకుంటూ అడుగగా పక్కన ఉన్న యాంకర్ అతనిది వేరే రకం అభిమానం అని కవర్ చేశారు.

ఇక కాజల్ కూడా నవ్వుతూ.. ఒక సమాధానం ఇచ్చింది. నీకు తప్పకుండా రాఖీ కడతాను అంటూ.. సమాధానం చెప్పడంతో అందరు ఒక్కసారిగా గట్టిగా అరిచేశారు. మొత్తానికి కాజల్ ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సినిమాలో తన పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని వివరించింది. ఇక వేడుకలో రాజమౌలి - కీరవాణితో పాటు అనుష్క ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.