Begin typing your search above and press return to search.

కాజలూ.. అవన్నీ సొంత ఖర్చులేనా?

By:  Tupaki Desk   |   8 March 2018 10:05 AM IST
కాజలూ.. అవన్నీ సొంత ఖర్చులేనా?
X
ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లయినా బ్యూటీని తగ్గకుండా కాపాడుకుంటూ వస్తున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి ఇప్పటికీ చేతిలో సినిమాలున్నాయి. కాజల్ తరవాత టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ ఓ రెండు మూడు సినిమాలు చేసి చివరకు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. కానీ ఇంకా హీరోయిన్ గానే కంటిన్యూ అవుతోందంటే ఇండస్ట్రీలో ఆమెకున్న క్రేజే కారణం.

కాజల్ లేటెస్ట్ గా తన తొలి స్క్రీన్ హీరో కళ్యాణ్ రామ్ తో కలిసి మరోసారి ఎంఎల్ ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాలో నటిస్తోంది. ఇందులో పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ - అజర్ బైజాన్ వెళ్లొచ్చింది. షూటింగ్ జరిగే చోటకు కాజల్ తోపాటు ఆమె తల్లి - చెల్లి నిషా - మేనల్లుడు ఇషాన్ కూడా వచ్చారు. ఇదే టైంలో మేనల్లుడు ఇషాన్ ఫస్ట్ ఫారిన్ ట్రిప్ అంటూ తెగ సంబర పడిపోతున్నారు. మొత్తం ఫ్యామిలీ ఫారిన్ ట్రిప్పుకయిన ఖర్చు ఇప్పుడు కాజల్ పెట్టుకుందా.. లేక కలిసొస్తుంది కదా నిర్మాత ఖాతాలో ఖర్చెట్టెంచిందా అన్నది ఇప్పుడు సందేహం.

సాధారణంగా స్టార్ హీరోయిన్లంటేనే ఖర్చు తడిసి మోపెడవుతుందని నిర్మాతలు కాస్త భయపడుతుంటారు. ఇలా హీరోయిన్ తోపాటు ఫ్యామిలీ మొత్తం వస్తే కాదనలేరు. ఖర్చు పెట్టుకోమని అడగనూలేరు. ఇప్పడు ఇదే రకమైన టూరో కాజలే క్లారిటీ ఇవ్వాలి. ఇస్తుందంటారా?