Begin typing your search above and press return to search.

17 ఏళ్ల అమ్మాయి పాత్రలో 34 ఏళ్ల హీరోయిన్‌

By:  Tupaki Desk   |   30 Aug 2019 2:26 PM IST
17 ఏళ్ల అమ్మాయి పాత్రలో 34 ఏళ్ల హీరోయిన్‌
X
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ఇటీవలే బాలీవుడ్‌ లో జాన్‌ అబ్రహం నటిస్తున్న 'ముంబయి సగ' చిత్రంలో ఛాన్స్‌ దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగులో అవకాశాలు రాని సమయంలో ముంబయి నుండి వచ్చిన ఆఫర్‌ తో కాజల్‌ కెరీర్‌ పై మళ్లీ ఆశలు చిగురించినట్లయ్యింది. ప్రముఖ స్టార్స్‌ నటిస్తున్న ముంబయి సగ చిత్రంకు సంజయ్‌ గుప్త దర్శకత్వం వహిస్తున్నాడు. ముంబయి రౌడీ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతుంది.

రెండు రోజుల క్రితం ముంబయి మహాలక్ష్మి ఆలయంలో సినిమా షూటింగ్‌ ను లాంచనంగా ప్రారంభించి రెగ్యులర్‌ షూటింగ్‌ ను కూడా కొనసాగిస్తున్నారు. రెండు గ్రూప్‌ ల మద్య గొడవ సీన్స్‌ ను మొదట చిత్రీకరించారు. ఇక ఈ చిత్రంలో కాజల్‌ పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు సంజయ్‌ గుప్త పలు ఆసక్తికర విషయాల రివీల్‌ చేశాడు. సినిమాలో కాజల్‌ పాత్ర రెండు విభిన్నమైన షేడ్స్‌ లో ఉంటుందని దర్శకుడు అన్నాడు.

17 ఏళ్ల వయసు అమ్మయిగా జాన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ గా కాజల్‌ కనిపిస్తుంది. ఇద్దరి మద్య లవ్‌ సీన్స్‌ మరియు రొమాంటిక్‌ సీన్స్‌ ఉంటాయి. అదే విధంగా 30 ఏళ్ల వయసు స్త్రీగా జాన్‌ భార్యగా ఒక పవర్‌ ఫుల్‌ ఉమెన్‌ గా కనిపించబోతుందని సంజయ్‌ చెప్పుకొచ్చాడు. సినిమాలోని రెండు విభిన్నమైన గెటప్స్‌ కోసం ఇప్పటికే మేకప్‌ టెస్టు చేశారని కాజల్‌ ఆ పాత్రకు చాలా బాగా సూట్‌ అవ్వడం వల్ల ఆమెను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 34 ఏళ్ల కాజల్‌ 17 ఏళ్ల అమ్మాయిగా ఎలా కనిపించనుందా అంటూ అప్పుడే ఆసక్తి స్టార్ట్‌ అయ్యింది. బాలీవుడ్‌ లో గతంలో ఈమె నటించిన సినిమా ఆడకపోవడంతో మళ్లీ అక్కడ ఛాన్స్‌ రాలేదు. మళ్లీ ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఈ అమ్మడికి ఛాన్స్‌ దక్కింది. ఈసారి బాలీవుడ్‌ లో పక్కా జెండా పాతేలా కాజల్‌ ప్రయత్నిస్తుంది.