Begin typing your search above and press return to search.

నోరు కట్టేసుకుని కష్టపడుతుందట

By:  Tupaki Desk   |   1 July 2021 4:05 PM IST
నోరు కట్టేసుకుని కష్టపడుతుందట
X
హీరోలు మరియు హీరోయిన్స్ డైట్ పాటించకుంటే.. వర్కౌట్స్ చేయకుంటే వారి బాడీలో అసమానతలు వస్తాయి. తద్వార వారి సినిమా ఆఫర్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే స్టార్‌ హీరోయిన్స్ మరియు హీరోలు రెగ్యులర్‌ గా వర్కౌట్ లు చేయడం.. అందుకు తగ్గట్లుగా డైట్ ను ఫాలో అవ్వడం చేస్తారు. కొందరు హీరోయిన్స్ కాస్త ఎక్కువే తింటారు. అందుకు తగ్గట్లుగా వర్కౌట్లు చేస్తారు. కాని హీరోయిన్ కాజల్‌ మాత్రం నోరు కట్టేసుకుని ఉంటుందట. ఆమె డైట్‌ విషయంలో పక్కాగా ప్లానింగ్ తో ఉంటుంది. ఆమె ప్రతి రోజు తినే ఆహారం పై ఇటీవల ఒకానొక సందర్బంగా స్పందించింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అయినా కూడా కాజల్‌ ఏమాత్రం ఫిజిక్ విషయంలో విమర్శలు ఎదుర్కోలేదు. పైగా గతంతో పోల్చితే ఇప్పుడే ఆమె అందంగా కనిపిస్తుందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్‌ సుదీర్ఘ కాలంగా ఒకే తరహా డైట్‌ ను ఫాలో అవుతూ ఉందట. పూర్తిగా శాఖహారి అయిన కాజల్‌ శరీరంకు ఎంత ప్రోటీన్ లు కావాలో అందుకు తగ్గట్లుగా ఆహారం తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా వర్కౌట్ లు చేస్తుందట. ఉదయం జొన్న రొట్టేతో మొదలు పెట్టి రాత్రి సింపుల్‌ గా పప్పు అన్నంతో ముగిస్తుందట. మద్యలో ప్రోటీన్ జ్యూస్‌.. మిల్క్‌ షేక్‌ వంటివి తాగుతుందట. గ్రీన్ టీ తో పాటు హెర్బల్‌ టీని కూడా తాగుతుందట.

తన ఆహారంలో ఎక్కువ ఫైబర్‌ ఉండేలా చూసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఇష్టమైన ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి. కాని వాటిని కూడా లిమిటెడ్‌ గా తింటాను అంది. నోరు కట్టేసుకుని మరీ తన ఫిజిక్‌ ను కాపాడుకుంటున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. ప్రతి రోజు రెగ్యులర్‌ గా తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు రాకుండా జాగ్రత్త పడటంతో పాటు వర్కౌట్‌ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత కూడా ఈమె హీరోయిన్ గా బిజీ బిజీగానే ఉంది. తెలుగు లో కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తోంది.