Begin typing your search above and press return to search.

కైకాలకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదంటే...

By:  Tupaki Desk   |   23 July 2016 5:34 AM GMT
కైకాలకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదంటే...
X
తెలుగు సినిమా చరిత్రకు సంబందించి చెప్పుకునే పేరుల్లో మొదటి పదిమందిలో కైకాల సత్యనారాయణ ఉంటారంటే అది అతిశయోక్తి కాదేమో! ఈ నవరస నటనా సార్వభౌముడు తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనమనసులో మాటలు పంచుకున్నారు. వాటిలో ముఖ్యంగా అవార్డులు - మర్యాదల గురించి ప్రస్థావించిన సత్యనారాయణ... తన ఆవేదనను - ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ.. అవార్డులు - ముఖ్యంగా జాతీయ స్థాయి అవార్డుల విషయంలో రాజకీయాల ప్రభావం - పాత్రపై కుండబద్దలు కొట్టారనే చెప్పాలి.

ఇప్పటికే చాలా వేదికలపై అవార్డులు రికమండేషన్ వల్ల మాత్రమే వస్తాయని పలువురు సినీ ప్రముఖులే బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు తెలిసినవే. ఇదే విషయంపై స్పందించిన సత్యనారాయణ.. 10ఏళ్ల క్రిందట పద్మశ్రీ కోసమని రికమండేషన్ పంపితే.. నాటి కాంగ్రెస్ గవర్నమెంట్ కు సంబందించిన శివరాజ్ పాటిల్ హోం మంత్రిగా ఉన్నారని.. దాంతో తనకు రావాల్సిన అవార్డు వెనక్కిపోయిందని చెప్పుకొచ్చారు. కారణం కనుక్కుంటే... ఒక ఆసక్తికరమైన విషయం తెలిసిందట! గతంతో తెలుగుదేశం పార్టీ తరఫున కైకాల సత్యనారాయణ పోటీచేయడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పద్మశ్రీ అవార్డును తిరస్కరించారని చెబుతున్నారు కైకాల. ఈ ఆవేదన - నిరాసలపై కైకాల తనదైన శైలిలో స్పందిస్తూ... ఎస్వీఆర్ - సావిత్రి వంటి మహా నటులకే ఇవ్వలేదు.. వాళ్లకున్నంత పేరు తనకు కూడా ఉంది కాబట్టి... తనకు కూడా ఇవ్వలేదేమో అని చమత్కరించారు!