Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో కైకాల‌..ఎవ‌రిలానంటే..?

By:  Tupaki Desk   |   26 July 2018 6:10 AM GMT
ఎన్టీఆర్ బ‌యోపిక్ లో కైకాల‌..ఎవ‌రిలానంటే..?
X
వాడుకున్నోడికి వాడుకున్నంత అన్న విష‌యాన్ని పూర్తిగా మ‌ర్చిపోయిన రంగం ఏదైనా ఉందంటే అది తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మే. ఎంతో మంది సీనియ‌ర్ న‌టులున్నా.. వారికి త‌గ్గ వేషాలు ఇవ్వ‌టంలో టాలీవుడ్ పూర్తిగా ఫెయిల్ అయ్యింద‌నే చెప్పాలి. రొడ్డు కొట్టుడు పాత్ర‌ల‌తో.. చౌక‌బాబు హాస్య‌మే త‌ప్పించి.. మంచి పాత్ర‌ల్ని తీర్చిదిద్దే ద‌ర్శ‌కులు మ‌న ద‌గ్గ‌ర త‌క్కువ‌.

ఒక‌వేళ మంచి పాత్ర‌లు సిద్ధం చేసిన కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు వారికి త‌గ్గ న‌టులు టాలీవుడ్ లో అస్స‌లు క‌నిపించ‌రు. ప‌ర భాషా న‌టుల‌కు పెద్దపీట వేస్తుంటారు. పెర‌టిచెట్టు వైద్యానికి ప‌నికి రాద‌న్న సామెత అచ్చు గుద్దిన‌ట్లుగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదంతా ఎందుకంటే.. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు ఒక వేషాన్ని ఇచ్చారు. 83 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న‌కు ఇచ్చిన పాత్ర‌లో ఎంత‌లా ఒదిగిపోయార‌న్న‌ది తాజాగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

వ‌య‌సు మీద ప‌డింద‌ని.. ఆయ‌న్ను శ్ర‌మ పెట్ట‌లేమ‌ని కొంద‌రు చెప్పినా.. అవ‌న్నీ అవ‌కాశాలు ఇవ్వ‌టానికి ఇష్టం లేక‌నే త‌ప్పించి.. మ‌రింకేమీ కాద‌న్న విష‌యం తాజా లుక్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఇప్ప‌టికే అగ్ర‌శ్రేణి తారాగ‌ణం.. ఊహించ‌ని రీతిలో స్టార్ క్యాస్టూమ్ ఇప్ప‌టికే ఉండ‌టం తెలిసిందే.

ఇక‌.. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు ఈ మూవీలో అల‌నాటి ఆణిముత్యాలైన భ‌క్త ప్ర‌హ్లాద‌.. తొలి త‌మిళ టాకీ చిత్రమైన కాళిదాసును తీసిన హెచ్ ఎం రెడ్డి పాత్ర‌ను పోషిస్తున్నారు. హెచ్ ఎం రెడ్డిగా సుప‌రిచితులైన ఆయ‌న అస‌లు పేరు హ‌నుమ‌ప్ప మునియ‌ప్ప రె్డ్డి. ఆయ‌న పాత్ర‌ను కైకాల పోషిస్తున్నారు. ఈ రోజు కైకాల వారి పుట్టిన రోజు. దీన్ని పుర‌స్క‌రించుకొని చిత్ర బృందం ఆయ‌న ఫ‌స్ట్ లుక్ ను బ‌ర్త్ డే గిఫ్ట్ గా విడుద‌ల చేసింది. దీన్ని చూసిన‌ప్పుడు కైకాల వారిలో క‌ళ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.