Begin typing your search above and press return to search.

దీపావళి కానుకగా 'కాదల్' టీజర్..!

By:  Tupaki Desk   |   13 Nov 2020 2:52 PM GMT
దీపావళి కానుకగా కాదల్ టీజర్..!
X
'కేరింత' 'మనమంతా' 'జెర్సీ' 'తోలుబొమ్మలాట' 'ఓ పిట్టకథ' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విశ్వంత్ నటించిన లేటెస్ట్ మూవీ ''కాదల్''. ఈ చిత్రంలో విశ్వంత్ సరసన చిత్రా శుక్లా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతో కళ్యాణ్‌ జీ గొంగన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టఫెనెడ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్ పై కిరణ్ రెడ్డి మందాడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ మద్దుకూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా 'కాదల్' సినిమా టీజర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'కాదల్' టీజర్ చూస్తుంటే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇక టీజర్ లో ఇది 2004లో జరిగిన ప్రేమ కథ అని పేర్కొన్నారు. హీరోయిన్ ని చూడగానే ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించే యువకుడి పాత్రలో హీరో విశ్వంత్ కనిపించాడు. ఇందులో రాకేందు మౌళి - దేవీ ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 'నా వయసు నీకంటే ఎక్కువని బాధపడుతున్నావా?' అని హీరోయిన్ అడిగితే.. 'అబ్బే.. ఏజ్ తో పనేముంది.. మాములుగా మాట్లాడటానికి' అంటూ హీరో చెప్పడంతో తన ప్రేమను దాచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టీజర్‌ కి మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ అందించిన థీమ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది.