Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ రేంజ్ అన్నారు.. కట్ చేస్తే ఓటీటీలోకి!

By:  Tupaki Desk   |   27 March 2023 4:48 PM IST
కేజీఎఫ్ రేంజ్ అన్నారు.. కట్ చేస్తే ఓటీటీలోకి!
X
విలక్షణ నటుడు, కన్నడ మెగా సూపర్ స్టార్ ఉపేంద్ర హీరో గా వచ్చిన చిత్రం కబ్జా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన శ్రియా శరణ్ నటించి మెప్పించింది. అలాగే సుదీప్, శివ రాజ్ కుమార్ లు కీలక పాత్ర పోషించారు. ఎంటీబీ నాగరాజ్ సమర్పణలో శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్న కబ్జా సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు.

మొత్తం ఐదు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కేజీఎఫ్ తరహాలో ఉందని చాలా మంది కామెంట్లు చేశారు. అంతా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు గా నిలుస్తుందని భావించారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. హిట్టు కాదు కదా... భారీ డిజాస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా మల్టీ స్టారర్ గా అంచనా వేసినప్పటికీ... ఓ ఒక్కరితోనూ సినిమా బాగుందని అనిపించలేక పోయింది.

దారుణంగా నష్టాలను మిగిల్చింది. దర్శక, నిర్మాతలు ఇద్దరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ ధైర్యం చేయలేక అడ్వాన్స్ ఓటీటీ రిలీజ్ కు సినిమాను ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే ప్లాప్ అయిన ఈ మల్టీ స్టారర్ చిత్రం అమెజన్ ప్రైమ్ లో ఏప్రిల్ 14వ తేదీ నుంచి రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

అంతేకాకుండా మార్చి 17వ తేదీన రిలీజ్ అయిన కబ్జా సినిమా అన్ని భాషల్లో కలిపి తొమ్మిది రోజుల్లో కేవలం 32 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టినట్లు సమాచారం. 110 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించగా... అందులో సగం డబ్బులను కూడా రాబట్టలేక పోయిందీ ఉపేంద్ర కబ్జా. కన్నడ మినహా మిగిలిన భాషల్లో ఈ సినిమా మొదటి వారంలోనే థియేటర్ల నుంచి ఎత్తేశారు.

దర్శక, నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. వచ్చే నెల 14వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ చిత్రాన్ని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి మరి. ఏది ఏమైనా ఎన్నెన్నో ఆశలతో వచ్చిన ఈ సినిమా అందరిలోనూ తీవ్ర విషాధాన్ని నింపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.