Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ తర్వాత కన్నడ నుండి మరో పాన్ ఇండియా మూవీ
By: Tupaki Desk | 17 Nov 2020 12:15 PM ISTమొన్నటి వరకు కన్నడ సినిమాలు అంటే పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కనీసం సౌత్ ఇండియా మొత్తం కూడా కన్నడ సినిమాలకు పెద్దగా ఆధరణ ఉండేది కాదు. తెలుగు తమిళం సినిమాలు కమర్షియల్ పరంగా మలయాళం సినిమా కంటెంట్ పరంగా టాప్ లో ఉంటే కన్నడ సినిమాలు మాత్రం అది లేక ఇది లేక సో సో గానే ఉంటుంది అంటూ కామెంట్స్ వచ్చేవి. కాని ఎప్పుడైతే కేజీఎఫ్ వచ్చిందో అంతా కూడా కన్నడ సినిమాల వైపు చూడటం మొదలు పెట్టారు. కన్నడంలో కూడా మంచి కంటెంట్ సినిమాలు భారీ సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటూ కేజీఎఫ్ నిరూపించింది.
కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా మూవీగా వచ్చిన విషయం తెల్సిందే. కేజీఎఫ్ వేసిన దారిలోనే ఇప్పుడు ఉపేంద్ర నటించిన కబ్జ సినిమాను విడుదల చేయబోతున్నారు. అయిదు భాషల్లో ఒకే టైటిల్ తో ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఉపేంద్ర సౌత్ లో అన్ని భాషల ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు కూడా కొన్ని సినిమాలతో సుపరిచితుడే. అందుకే కబ్జ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయబోతున్నట్లుగా మోషన్ పోస్టర్ విడుదల సందర్బంగా అధికారికంగా ప్రకటించారు. అన్ని భాషలకు సంబంధించిన టైటిల్ లోగోను ప్రదర్శించి పాన్ ఇండియా మూవీ అంటూ చెప్పకనే చెప్పారు. ఈ సినిమాకు ఆర్ చంద్రు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను రెగ్యులర్ గా విడుదల అయ్యే అయిదు భాషల్లోనే కాకుండా మరాఠీ మరియు ఒరియా భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారట.