Begin typing your search above and press return to search.

బాలయ్యకు స్మార్ట్‌ విలన్‌ తగిలాడు

By:  Tupaki Desk   |   27 Aug 2015 4:22 AM GMT
బాలయ్యకు స్మార్ట్‌ విలన్‌ తగిలాడు
X
నటసింహా బాలయ్య 100వ సినిమా ముంగిట ఉన్నాడు. 99వ సినిమా డిక్టేటర్‌ శ్రీవాస్‌ దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కుతోంది. ఇటీవలే మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ కోసం యూరప్‌ వెళ్లేందుకు యూనిట్‌ రెడీ అవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన తెలుగింటి సీతమ్మ అంజలి కథానాయికగా ఆడిపాడుతోంది.

అయితే బాలయ్యకు ధీటైన విలన్‌ ఎవరు? అని వెతికిన శ్రీవాస్‌ ఓ స్మార్ట్‌ విలన్‌ ని పట్టేశాడు. జిల్‌ చిత్రంలో గోపిచంద్‌ తో పోటీ పడి నటించిన ముంబై మోడల్‌ కం నటుడు కబీర్‌ సింగ్‌ దుహన్‌ ను ఎంపిక చేసుకున్నాడు. కబీర్‌ ఇటీవలే కిక్‌ -2లోనూ ఓ కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బాలయ్య తో యంగ్‌ విలన్‌ పోరాటాలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి నందమూరి అభిమానుల్లో క్రియేటైంది. బాలయ్య అంటేనే మాస్‌. మాస్‌ స్టయిల్‌ ఫైట్స్‌ అదరహో. ఈ ఇద్దరి మధ్యా టిట్‌ ఫర్‌ ట్యాట్‌ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

అయితే ఇప్పటికే ఈ సినిమాలో మరో విలన్‌ రవికిషన్‌ కూడా చేస్తున్నాడు. రేసుగుర్రం సినిమాలో ఇరగదీసిన ఇతగాడు, మొన్ననే కిక్‌ 2 సినిమాలో కూడా విలన్‌ సోలోమాన్‌ గా చేశాడు. గమ్మత్తేంటంటే.. ఆ సినిమాలో రవికిషన్‌ కొడుకుగా నటించింది ఎవరో కాదు.. పైన చెప్పిన కబీర్‌ సింగ్‌ దుహన్‌, అదే ఆ స్మార్ట్‌ జిల్‌ విలన్‌.. అది సంగతి.