Begin typing your search above and press return to search.

సల్మాన్, షారుఖ్ లకన్నా అజితే ఎక్కువట..

By:  Tupaki Desk   |   8 Sept 2015 7:54 PM
సల్మాన్, షారుఖ్ లకన్నా అజితే ఎక్కువట..
X
తమిళ నటుడు అజిత్ కున్న క్రేజ్ అసామాన్యం. అతని సినిమా వస్తుందంటేనే తమిళనాట పండగ వాతావరణం కనిపిస్తుంది. నెరిసిన జుట్టు, మాసిన గెడ్డంతో కూడా భయంకరమైన హీరోయిజాన్ని పలికించగల ఘనుడు. ఆయన అశేష అభిమానులలో సెలబ్రిటీలు కూడా వుండడం గమనార్హం. ఇప్పుడు వారి జాబితాలోకి మరో సెలబ్రిటీ తోడయ్యాడు.

గోపీచంద్ జిల్ సినిమాలో విలన్ గా నటించి అనతికాలంలోనే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ ల సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కబీర్ ప్రస్తుతం అజిత్ తదుపరి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అజిత్ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకురావడమేకాక అంతటి స్టార్ హీరో ఎటువంటి హంగులు లేకుండా వుండడం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నాడు.

అంతేకాక తమిళనాట అజిత్ అభిమానగణం చాలా పెద్దదని, అభిమానుల విషయంలో అజిత్ సర్ బాలీవుడ్ లో సల్మాన్, షారుఖ్ లను మించిపోయారని సెలవిచ్చాడు. ఈ సినిమా ద్వారా తనకి తండ్రితో సమానమైన గురువు దొరికారని మురిసిపోయాడు.