Begin typing your search above and press return to search.

ఆ విలన్‌కు దిష్టి తగిలేలా ఉంది

By:  Tupaki Desk   |   25 Jun 2015 1:30 PM GMT
ఆ విలన్‌కు దిష్టి తగిలేలా ఉంది
X
టాలీవుడ్‌లో హీరోలకు ఎప్పుడూ కొదవ ఉండదు. ఉన్నవాళ్లు ఎక్కడికీ పోరు. కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. అందుకే ఏ ఇండస్ట్రీలో లేనంతమంది హీరోలతో కళకళలాడిపోతోంది టాలీవుడ్‌. ఐతే ఆ హీరోలకు తగినంత మంది హీరోయిన్లు, విలన్లే కరవైపోతున్నారు. హీరోయిన్లయినా ముంబయి నుంచి ఈజీగానే పట్టుకొచ్చేయొచ్చు. వాళ్ల యాక్టింగ్‌ ఎలా ఉన్నా.. అందంతో మ్యాజిక్‌ చేసేయొచ్చు. కానీ ఇబ్బందంతా ఈ విలన్లతోనే. హీరోలకు దీటైన విలన్లు లేక చాలా సినిమాలు తేలిపోతున్నాయి. ప్రకాష్‌ రాజ్‌ ఫేస్‌ మరీ బోర్‌ కొట్టేస్తుండటం కొత్త విలన్ల కోసం డైరెక్టర్లు పక్క ఇండస్ట్రీల సినిమాల మీద ఓ కన్నేసి ఉంచుతున్నారు. అయినా కొరత తీరట్లేదు.

ఇలాంటి సమయంలో ఈ ఏడాది వచ్చిన 'జిల్‌' సినిమా టాలీవుడ్‌కు ఓ విలన్‌ను సెట్‌ చేసి పెట్టింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన కబీర్‌ సింగ్‌ ఇన్‌స్టెంట్‌గా తెలుగు ప్రేక్షకులకు నచ్చేశాడు. టాలీవుడ్‌లో ఓ విలన్‌ ఇంత స్టైలిష్‌గా కనిపించడం ఈ మధ్య కాలంలో లేదు. స్టైలిష్‌గా ఉంటూనే క్యారెక్టర్‌కు తగ్గ ఇంటెన్సిటీ చూపించిన కబీర్‌.. సినిమా విడుదలైన కొన్ని రోజులకే మోస్ట్‌ వాంటెడ్‌ అయిపోయాడు. పెద్ద హీరోలకు దీటుగా విలన్‌గా పనికొస్తాడని చాలామంది డైరెక్టర్లు అతణ్ని లైన్లో పెట్టారు. ముందుగా నారా రోహిత్‌ తాను చేయబోయే 'మాన్‌ కరాటే'లో అతడికి విలన్‌గా ఛాన్స్‌ ఇచ్చాడు. ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. అవి త్వరలోనే అనౌన్స్‌ చేయబోతున్నారు. మరోవైపు తమిళ స్టార్‌ హీరో అజిత్‌ సినిమాలోనూ ఛాన్స్‌ దక్కించుకున్నాడు కబీర్‌. చూస్తుంటే భవిష్యత్‌లో విలన్‌గా ఫుల్‌ బిజీఅయిపోయేట్లే ఉన్నాడీ బాలీవుడ్‌ మోడల్‌.