Begin typing your search above and press return to search.
'అర్జున్ రెడ్డి' కంటే రఫ్ అండ్ రగ్డ్
By: Tupaki Desk | 22 April 2019 11:24 AM ISTగుబురు గడ్డం.. కోరమీసం .. చెదిరిన జుట్టు.. మెడలో స్నెతస్కోప్.. ఈ గెటప్ ఎక్కడో చూసినట్టుందే అనుకుంటే పొరపాటే. `అర్జున్ రెడ్డి` గెటప్ ఇది. విజయ్ దేవరకొండ నటించిన `అర్జున్ రెడ్డి` బాలీవుడ్ రీమేక్ `కబీర్ సింగ్` లో షాహిద్ కపూర్ లుక్ ఇది. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. తెలుగు వెర్షన్ విజువల్స్ కంటే బెటర్ గా ఉందని డార్లింగ్ ప్రభాస్ అంతటి వాడే షాహిద్ కి నేరుగా ఫోన్ చేసి మరీ ప్రశంసించారు. ఏడు నిమిషాల పాటు ఫోన్ లో షాహిద్ తో మాట్లాడారు ప్రభాస్.
తాజాగా మరో కొత్త లుక్ ని హీరో షాహిద్ కపూర్ స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా రివీల్ చేశారు. ఈ పోస్టర్ తో పాటే ``రెండు నెలల్లో వచ్చేస్తున్నాం. 21 జూన్ రిలీజ్.. అంతవరకూ వెయిట్ చేయండి`` అంటూ షాహిద్ సూటిగా మ్యాటర్ ఏంటో చెప్పేశాడు. కబీర్ సింగ్ లుక్ .. టీజర్ పై ఇప్పటికే భార్య మీరా రాజ్ పుత్ సైతం ప్రశంసలు కురిపించారు. షాహిద్ & టీమ్ ఈ సినిమా విజయంపై పూర్తి ధీమాగా ఉన్నారు. తెలుగు వెర్షన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన డెబ్యూ ఎటెంప్ట్ ని ఏమాత్రం అజాగ్రత్త అన్నదే లేకుండా హ్యాండిల్ చేస్తున్నారని అర్థమవుతోంది.
`పద్మావత్` చిత్రంలో రాజ్ పుత్ రాకుమారుడిగా అద్భుతంగా నటించి మెప్పించిన షాహిద్ తన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ డ్రగ్స్ నేపథ్యంలో ఉడ్తా పంజాబ్ లో రఫ్ & ఠఫ్ పాత్రలో నటించిన అనుభవం అతడికి ఉంది. అందుకే దారి తప్పిన మెడికోగా.. డ్రగ్స్ తీసుకునేవాడిగా.. ఆల్కహాలిక్ గా అద్భుతంగా ఇమిడిపోయి నటించాడని అర్థమవుతోంది. ఉడ్తా పంజాబ్ లోనూ గుబురు గడ్డం.. పొడవాటి గిరజాల జుత్తు .. వెస్ట్రన్ స్టైలింగ్ తో షాహిద్ చించి ఆరేశాడు. పాత్రలోకి పరకాయం చేసి మైమరిపించే అరుదైన స్టార్లలో షాహిద్ ఒకడు. ఈ కారణాలన్నీ షాహిద్ `కబీర్ సింగ్` పై అంతకంతకు అంచనాల్ని పెంచేస్తున్నాయి.