Begin typing your search above and press return to search.

బాలీవుడ్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్

By:  Tupaki Desk   |   20 Jun 2016 7:30 AM GMT
బాలీవుడ్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్
X
బాలీవుడ్లో కబీర్ ఖాన్ ఓ విలక్షణమైన దర్శకుడు. అతనెప్పుడూ లోకల్ సినిమాలు తీయడు. అతను కచ్చితంగా తన ప్రతి సినిమానూ మరో దేశం నేపథ్యంలో కథను నడిపిస్తాడు. కాబూల్ ఎక్స్ ప్రెస్.. న్యూయార్క్.. ఏక్ థా టైగర్.. భజరంగి భాయిజాన్.. ఫాంటమ్.. ఇలా అతడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ పరిశీలిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ముఖ్యంగా తన సినిమాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తేవడం అతడికి చాలా ఇష్టం. సల్మాన్ ఖాన్‌ తో అతను తీసిన ‘భజరంగి భాయిజాన్’ చాలా పెద్ద హిట్టు కావడమే కాదు.. పాకిస్థాన్ ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకుంది. కబీర్ మరోసారి ఇండియా-పాకిస్థాన్ లింకుతో ఓ కొత్త కథ సిద్ధం చేశాడట.

ఈ సినిమాలో సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించబోతున్నట్లు సమాచారం. హృతిక్ గత రెండేళ్లుగా ‘మొహెంజదారో’కే అంకితమైపోయి ఉన్నాడు. ఇప్పుడే అతడికి విడుదల లభించింది. దీని తర్వాత ‘కాబిల్’ను పూర్తి చేసే పనిలో పడ్డ హృతిక్ తర్వాతి సినిమా విషయంలో ఏ కమిట్మెంట్ ఇవ్వలేదు. మరోవైపు కబీర్.. సల్మాన్ ఖాన్ హీరోగా ‘ట్యూబ్ లైట్’ సినిమాను ఇంకో రెండు మూడు నెలల్లో పూర్తి చేసేస్తాడు. ఆ తర్వాత హృతిక్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా. హృతిక్-కబీర్ కాంబినేషన్ కచ్చితంగా బాలీవుడ్లో పెద్ద సెన్సేషన్ అవుతుందడంలో సందేహం లేదు.