Begin typing your search above and press return to search.

మాంత్రికుడి అవతారంలో స్టైలిష్ విలన్

By:  Tupaki Desk   |   24 Jan 2018 4:30 AM GMT
మాంత్రికుడి అవతారంలో స్టైలిష్ విలన్
X
టాలీవుడ్ లో విలన్ గా కబీర్ దుహాన్ సింగ్ బాగానే సెట్ అయిపోయాడు. జిల్ మూవీలో విలన్ గా పాత్రను పండించేసిన తర్వాత చాలానే ఆఫర్స్ క్యూ కట్టేశాయి. వచ్చిన ఆఫర్స్ ఉపయోగించుకుంటూ అనేక సినిమాలను కూడా చేసేశాడు. తెలుగు ప్రేక్షకులలో ట్యాలెంటెడ్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు కూడా.

వరుసగా విలన్ పాత్రలనే.. నెగిటివ్ క్యారెక్టర్స్ నే చేస్తూండడంతో బోర్ కొట్టేస్తోందని గతంలో ఓసారి చెప్పాడు కబీర్ దుహాన్ సింగ్. ఇతర భాషల నుంచి వచ్చిన సినిమా ఆఫర్లు కూడా ఇదే బాపతుగా ఉన్నాయి. అయితే.. ఇప్పుడు రాబోతోన్న ఓ మూవీ మాత్రం కబీర్ దుహాన్ సింగ్ కోరిక తీరిపోతోంది. విభిన్నమైన పాత్రను చేయాలనే కోరికను.. '9' మూవీతో తీర్చేసుకుంటున్నాడు ఈ విలన్. తొలిసారిగా నెగిటివ్ పాత్ర కాకుండా.. ఓ భూతాల మాంత్రికుడి పాత్రలో కనిపించబోతున్నాడట.

హారర్ కం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన 9 మూవీని.. కొత్త దర్శకుడు అశ్వని కుమార్ రూపొందిస్తున్నాడు. తన క్యారెక్టర్ వినగానే నచ్చేసిందని.. ఓ ఇంట్లో ఉండే దెయ్యాలను బయటకు తీసి పారద్రోలే పాత్రను పోషిస్తున్నాడు కబీర్ దుహాన్ సింగ్. ఈ కథ చాలా గ్రిప్పింగ్ ఉంటుందని.. ఆడియన్స్ బోలెడంత థ్రిల్ కు గురవుతారని అంటున్నాడు ఈ స్టైలిష్ విలన్.