Begin typing your search above and press return to search.

జిల్ విలనూ.. ఏంటీ ఘోరం..

By:  Tupaki Desk   |   8 April 2016 3:30 PM GMT
జిల్ విలనూ.. ఏంటీ ఘోరం..
X
జిల్ మూవీతో టాలీవుడ్ లో విలన్ గా అరంగేట్రం చేశాడు ముంబై మోడల్ కబీర్ దుహాన్ సింగ్. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా.. విలన్ గా కబీర్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. తర్వాత కోలీవుడ్ లో అజిత్ కి విలన్ గా చేయడమే కాకుండా.. తెలుగులోనే ఏడాది సమయంలో అర డజన్ సినిమాల్లో విలన్ గా యాక్ట్ చేశాడు కబీర్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయడం తనకు డ్రీమ్ అని చెప్పిన కబీర్ చాలా త్వరగానే ఆ ఛాన్స్ అందుకున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ లో కబీర్ కి ఛాన్స్ రావడంతో.. కబీర్ రేంజ్ మారిపోయినట్లే అనుకున్నారు అంతా. అయితే.. సినిమాలో కనుక ఇతగాడి కేరక్టర్ చూస్తే.. ఏంటీ ఘోరం అనుకోవడమే కాదు.. ఎవరికైనా నవ్వు రాక మానదు. మెయిన్ విలన్ శరద్ కేల్కర్ కి పక్కనే ఉంటూ.. ఓ గన్ పట్టుకుని తిరిగే రోల్ అంతే.

కనీసం నోటి వెంట ఓ డైలాగ్ కూడా లేని ఓ రోల్ ని... మెయిన్ విలన్ పాత్రలను చేసిన యాక్టర్ చేయడం అంటే ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాని పరిస్థితి. బాబూ కబీరూ.. కేరక్టర్స్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇక విలన్ పక్కన రౌడీ గ్యాంగ్ లో ఒకడిగా మారిపోయే పరిస్ధితి వస్తుంది జాగ్రత్త.