Begin typing your search above and press return to search.

జిల్ విలన్.. సార్ కోసం చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   6 May 2017 11:38 AM GMT
జిల్ విలన్.. సార్ కోసం చేస్తున్నాడు
X
టాలీవుడ్లో ఇప్పుడు హీరోలా కనిపించే విలన్లు కోసం తెగ వెతుకుతున్నారు. ఆ క్రమంలో మన ఫ్యామిలి స్టార్ హీరో జగపతి బాబు కూడా విలన్ గా మారి వాటిని భర్తీ చేస్తున్నారు. ఈ మధ్య చాలా మంది కొత్త యువ విలన్లు ఇండస్ట్రి లోకి వచ్చారు. అలా వచ్చినవాడే జిల్ సినిమాతో అందరి దృష్టిలో పడ్డ హింది నటుడు కబీర్ దుహన్ సింగ్. ఇప్పుడు జగపతి బాబు హీరోగా వస్తున్న సినిమా ‘పటేల్ SIR’ లో ప్రతినాయకుడుగా చేస్తున్నారు.

“జిల్ సినిమాతో నాకు తెలుగులో మంచి గుర్తింపు దాని వలన చాలా అవకాశాలు కూడా వచ్చాయి. మంచి బేనర్లో పని చేసే అధృష్టం దక్కింది. కానీ ఇప్పుడు జగపతి బాబు తో పని చేసినప్పుడు నా మొదటి తెలుగు సినిమా కన్నా ఎక్కువ కిక్ ఇచ్చింది. ఇది నా కెరీర్ లో మరో మలుపు తిప్పే సినిమా అవుతుంది అనే నమ్మకంగా ఉంది'' అంటున్నాడు జిల్ విలన్. అయితే ఈ సినిమాలో సార్ కోసం చాలా ఫీట్లు చేశానని మనోడు చెప్పుకొచ్చాడు. ఎలాంటి ఫీట్లు చేశాడనే విషయం తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఇప్పటికే టీజర్ విడుదలై యూట్యూబ్ లో మంచి మార్క్ కి చేరింది. ఈ సినిమా లో జగపతి బాబు ఉన్న తీరు జనాలో ఒక ఆశక్తినిరేపింది. ఈ సినిమాను వాసు పరిమి డైరెక్ట్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/