Begin typing your search above and press return to search.

నెంబర్‌ అడిగిన అతడికి షాక్‌ ఇచ్చిన సన్నీ

By:  Tupaki Desk   |   21 Feb 2020 10:32 AM GMT
నెంబర్‌ అడిగిన అతడికి షాక్‌ ఇచ్చిన సన్నీ
X
బాలీవుడ్‌ లో ప్రస్తుతం స్టార్‌ హాట్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ సన్నీలియోన్‌. మాజీ పోర్న్‌ స్టార్‌ అయిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుసగా చిత్రాలు చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఈమెతో చాటింగ్‌ చేసేందుకు.. మాట్లాడేందుకు ఎంతో మంది ఆరాటపడుతూ ఉంటారు. ఇటీవల ఈమె డబ్బో రత్నాని 2020 క్యాలెండర్‌ ఫొటో షూట్‌ లో పాల్గొంది.

క్యాలెండర్‌ ఆవిష్కరణ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. ఇందులో కబీర్‌ బేడీ కూడా హాజరు అయ్యాడు. అందులో సన్నీలియోన్‌ ఫొటో షూట్‌ ను చూసి ఇంప్రెస్‌ అయిన కబీర్‌ బేడీ ఆమెతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించాడట. ఆమెను ఫొటో షూట్‌ గురించి అభినందించిన ఆయన ఆమె నెంబర్‌ అడిగాడట. పెద్దాయన నెంబర్‌ అడిగినప్పుడు ఇవ్వకుంటే బాగోదని భావించిన సన్నీలియోన్‌ నెంబర్‌ ఇచ్చిందట.

నెంబర్‌ అయితే ఇచ్చింది కాని అది ఆమె నెంబర్‌ కాదట. తన భర్త డానియల్‌ నెంబర్‌ ను కబీర్‌ బేడీకి ఇచ్చిందట. ఆమె భర్త నెంబర్‌ ఇవ్వడంతో మరోసారి కబీర్‌ బేడీ అవాక్కయ్యాడట. అందంతో పాటు తెలివి ఉన్న సన్నీలియోన్‌ ను కబీర్‌ అభినందించాడు. నెటిజన్స్‌ కూడా సన్నీలియోన్‌ తెలికి ఫిదా అవుతున్నారు.