Begin typing your search above and press return to search.

స్టార్ హోటల్స్ లో కబాలి స్పెషల్ షో

By:  Tupaki Desk   |   18 July 2016 11:08 AM IST
స్టార్ హోటల్స్ లో కబాలి స్పెషల్ షో
X
ఇది నిజంగా ట్రెండ్ సెట్టింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఒక సినిమా, అందులోనూ పరాయి భాష చిత్రాన్ని థియేటర్ లలో విడుదల చెయ్యడానికి నానా ఆలోచనలు పడుతున్న తరుణంలో ఏకంగా స్టార్ హోటల్స్ లో స్పెషల్ ప్రీమియర్ లను ఆలోచించకుండా ప్రదర్శిస్తున్నారంటే అది కేవలం కబాలికే చెల్లింది.

ఈ వారాంతరం కబాలి సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన స్థాయిలో విడుదలకానున్న తరుణంలో రజినీ ఫీవర్ కి అంతులేకుండాపోతుంది. చెన్నైలో ఇప్పటికే టిక్కెట్లు పెట్టడం - అవి సూపర్ హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం తెలిసినదే. అయితే బెంగళూరులో కన్నడ సినిమాల జోరుకు అడ్డుకడుతూ ఏకంగా 10కోట్ల రికార్డ్ ధరతో తమిళ వెర్షన్ కన్నడ నేల మీద ముస్తాబవుతోంది.

విశేషమేమిటంటే శుక్రవారం మొదలుకుని మూడు రోజుల పాటు బెంగళూరు లో పేరుమోసిన మూడు స్టార్ హోటల్స్ లో హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్ వాడి ఈ సినిమాను ప్రదర్శించనున్నారట. టికెట్ ధర 1300 అని - బుక్ మై షో ద్వారా కొనవచ్చునని యాజమాన్యం ప్రకటించింది. 300 మెంబెర్స్ సీటింగ్ లో నిర్వహిస్తున్న ఈ ప్రీమియర్ ఇండియాలోనే తొలిసారిగా భావిస్తున్నారు. దట్ ఈజ్ తలైవా..