Begin typing your search above and press return to search.

సూర్య 24లో సూపర్ స్టార్ సర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   20 April 2016 5:26 PM GMT
సూర్య 24లో సూపర్ స్టార్ సర్ ప్రైజ్
X
కోలీవుడ్ హీరో సూర్య నటించిన 24 మూవీ మే 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో ఒకే రోజున భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో సూర్య ఇచ్చే థ్రిల్స్ తో పాటు.. మరో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా మిక్స్ కానుంది. అది సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తో లింక్ అయినది కావడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

రజినీ నటించిన లేటెస్ట్ మూవీ కబాలి. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గా తన వెర్షన్ డైలాగ్స్ కి డబ్బింగ్ చెప్పడం కూడా మొదలుపెట్టారట రజినీకాంత్. ఈ కబాలి చిత్రానికి సంబంధించిన టీజర్ ను.. సూర్య మూవీతో పాటు కలిపి ప్రదర్శించనుండడమే.. అసలు సిసలైన సర్ ప్రైజ్.

చెప్పేశాక అది సర్ ప్రైజ్ ఎలా అవుతుందనే ప్రశ్న తలెత్తచ్చు కానీ.. సూపర్ స్టార్ రజినీకాంత్ ను స్క్రీన్ పై చూడ్డం ఎప్పుడైనా సర్ ప్రైజ్ అనాల్సిందే. రజినీ లుక్ - డైలాగ్స్ - కేరక్టరైజేషన్ జనాలను ఎప్పుడూ థ్రిల్ చేస్తూనే ఉంటాయి. అలా సూర్య 24లో జనాలకు సూపర్ స్టార్ సర్ ప్రైజింగ్ థ్రిల్ ఇవ్వనున్నాడన్న మాట.