Begin typing your search above and press return to search.

కబాలి షాక్ తో మనోళ్లకి పండగే..

By:  Tupaki Desk   |   22 July 2016 11:00 PM IST
కబాలి షాక్ తో మనోళ్లకి పండగే..
X
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఫ్యాన్స్ కి తప్ప ఎవరికీ నచ్చకపోవడం.. స్లో నెరేషన్ కారణంగా బాగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. డబ్బింగ్ సినిమాగా వచ్చి సంచలనాలు సృష్టిస్తుందని అనుకున్న కబాలికి.. ఇలాంటి టాక్ కారణంగా తెలుగు సినిమాలు లాభపడ్డం ఖాయంగా కనిపిస్తోంది.

కబాలి వస్తూ వస్తూనే ఇక్కడ థియేటర్లలో ఉన్న చాలా సినిమాలకు చెక్ చెప్పేశాడు. అ..ఆ.. - జెంటిల్మన్ మూవీలు థియేటర్ల నుంచి ఎగిరిపోయాయి. ఇక సినిమాకి కానీ సెన్సేషనల్ టాక్ వస్తే.. వచ్చేవారి విడుదలయ్యే సినిమాలపై కూడా ప్రభావం పడేది. ముఖ్యంగా జక్కన్న - పెళ్లి చూపులు సినిమాలపై ఎఫెక్ట్ గట్టిగానే ఉండేది. కబాలితో పోటీ పడాల్సిన పరిస్థితి కనిపించేది. కానీ కబాలికి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవడం.. ఇప్పుడు తెలుగు సినిమాలకు ప్లస్ కానుంది. వీకెండ్ వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ మినహాయిస్తే.. ఆ తర్వాత కలెక్షన్స్ కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

రాబోయే తెలుగు సినిమాలకు పాజిటివ్ సంగతేమో కానీ.. ఇప్పుడు 30 కోట్లు పోసి కబాలిని కొనుక్కున్న వాళ్ల పరిస్థితేంటనే ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటికి ఉన్న అంచనాల ప్రకారం సగానికి సగం నష్టాలు తప్పకపోవచ్చని టాక్.