Begin typing your search above and press return to search.

రజనీ కబాలి లుక్‌ ఆన్‌ లైన్‌ లో

By:  Tupaki Desk   |   24 Aug 2015 4:04 AM GMT
రజనీ కబాలి లుక్‌ ఆన్‌ లైన్‌ లో
X
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించే కొత్త సినిమా డీటెయిల్స్‌ ఏమిటి? ఈ విషయంపైనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో చర్చ సాగుతోంది. సరైన టైమింగుతో రజనీ 'కబాలి' లుక్‌ ఆన్‌ లైన్‌ లోకి వచ్చింది. సోషల్‌ నెట్‌ వర్క్‌ లో ఈ లుక్‌ పై రకరకాల డిష్కసన్స్‌ సాగుతున్నాయి. అసలే రజనీ ఓ డాన్‌ పాత్రలో నటిస్తున్నాడు. మంచి, చెడు తెలిసిన డాన్‌. ప్రజల మనసుల్లో ఉన్న డాన్‌. అందుకు తగ్గట్టే కొత్త లుక్‌ వచ్చింది.

రజనీ న్యూలుక్‌ అదిరింది. మరోసారి నరసింహాని గుర్తు చేస్తున్నాడు. ఫోర్‌ హెడ్‌ పై ముందుకు రెండు ఫంకీలు ఫ్రీస్టయిల్‌ లో వదిలేసిన విగ్‌ ధరించి రజనీ స్టయిలిష్‌ గా కనిపించాడు. రజనీ 90లలో నటించిన ధర్మదురై క్యారెక్టర్‌ రిపీటవుతోందా? అనిపించింది. రజనీ లక్కీ హ్యాండ్‌, ప్రముఖ బాలీవుడ్‌ మేకప్‌ మేన్‌ ఈ లుక్‌ డిజైన్‌ చేశారు. ప్రముఖ కొరియన్‌ ఫోటోగ్రాఫర్‌ సారథ్యంలో ఇటీవలే ఫోటో షూట్‌ చేశారు.

లింగ సినిమా పరాజయం తర్వాత రజనీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కథ, దర్శకుడి ఎంపిక నుంచి ప్రతి విషయంలో కొత్తదనాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు లుక్‌ విషయంలోనూ అంతే కేర్‌ తీసుకున్నట్టే అనిపిస్తోంది. మరోసారి నరసింహా, భాషా, దళపతి వంటి మ్యాజిక్‌ ఏదైనా చేయాలని రజనీ అనుకుంటున్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది.