Begin typing your search above and press return to search.

సుల్తాన్‌ ని కొట్టే మగాడు ఆయనేగా!!

By:  Tupaki Desk   |   7 July 2016 10:00 AM GMT
సుల్తాన్‌ ని కొట్టే మగాడు ఆయనేగా!!
X
ఎమోషనల్ గా బాగుంది అనే టాక్‌ వస్తేనే బజరంగీ భాయ్‌జాన్ సినిమా దాదాపు 500 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. అదే ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్‌ వస్తే ఏంటి పరిస్థితి? సరిగ్గా ఇప్పుడు సుల్తాన్‌ సినిమా గురించి ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. బుధవారం రిలీజ్‌ అయినా కూడా సినిమాకు తొలిరోజు 40+ కోట్ల కలక్షన్ వచ్చింది అని తెలుస్తోంది. ఆ లెక్కన రికార్డులు మారు మోగిపోతాయ్‌ అంతే.

అయితే ఇప్పుడు సుల్తాన్‌ సినిమాను బీట్‌ చేయాలంటే మళ్ళీ బాహుబలి 2 సినిమా వచ్చే వరకు మనం వెయిట్‌ చేయాలా? అక్కర్లేదు. ఎందుకంటే సుల్తాన్‌ సినిమాలో అయితే సుల్తాన్‌ ను కొట్టాలంటే అవతల సైడ్‌ కూడా సుల్తానే ఉండాలి అంటూ డైలాగ్‌ తో పాటు.. క్లయమ్యాక్స్ ఫైట్‌ లో ఆ ఫీలింగ్‌ కూడా కలిగించేశాడు సల్మాన్‌ ఖాన్‌. కాని బాక్సఫీస్‌ వార్‌ విషయానికొస్తే సుల్తాన్‌ ను కొట్టే మగాడు ''కబాలి'' అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. ఎందుకంటే జూలై 22 కోసం కబాలి సినిమాను ఏకంగా 5 వేల ధియేటర్లలో ఇండియాలో రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ ఒక్క లెక్క చాలదూ.. తొలిరోజు కలక్షన్ల రికార్డులన్నీ హుష్‌ ఫటాక్ అయిపోవడానికి.