Begin typing your search above and press return to search.

మన టేస్ట్‌ మరీ అంత బ్యాడా?

By:  Tupaki Desk   |   14 Feb 2019 11:17 AM GMT
మన టేస్ట్‌ మరీ అంత బ్యాడా?
X
తమిళ సినిమాలు తెలుగులో, తెలుగు సినిమాలు తమిళంలో డబ్బింగ్‌ అవ్వడం చాలా కామన్‌ విషయం. కొన్ని సినిమాలు రెండు భాషల్లో ఒకేసారి విడుదలైతే కొన్ని సినిమాలు మాత్రం మొదట మాతృ భాషలో విడుదల అయ్యి ఆ తర్వాత పరాయి భాషలో డబ్‌ అవుతుంది. మాతృ భాషలో సక్సెస్‌ అయితేనే ఎక్కువ శాతం పరాయి భాషలో డబ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఏదో కొన్ని సందర్బాల్లో మాత్రమే అక్కడ ఫ్లాప్‌ అయినవి ఇక్కడ, ఇక్కడ ఫ్లాప్‌ అయినవి అక్కడ విడుదల చేస్తూ ఉంటారు. ఒక చోట ఫ్లాప్‌ అయినవి మరో చోట డబ్‌ అయ్యి సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు. ఆ విషయం తెలిసి కూడా తమిళంలో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన ఒక సినిమాను తెలుగులో డబ్‌ చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు శంకర్‌ కు ప్రియ శిష్యుడు అయిన వసంత బాలన్‌ దర్శకత్వంలో సిద్దు హీరోగా రూపొందిన 'కావ్య తలైవన్‌' చిత్రం అక్కడ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఆ చిత్రం కనీసం 5 కోట్లను కూడా రాబట్టలేక పోయింది అంటూ తమిళ సినీ వర్గాల్లో టాక్‌ ఉంది. ఆ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో జోకులు పుట్టుకు వచ్చాయి. అంతటి ఫ్లాప్‌ అయిన తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేయడం ద్వారా నిర్మాతలు తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌ బ్యాడ్‌ అంటూ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌ బ్యాడ్‌ కనుక ఈ సినిమాను ఏమైనా ఆధరిస్తారేమో చూద్దాం అంటూ 'కావ్య తలైవన్‌' చిత్రాన్ని తెలుగులో ప్రేమాలయం' అనే పేరుతో డబ్‌ చేసి విడుదల చేయబోతున్నారు. తమిళంలో డిజాస్టర్‌ అయిన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలనుకునే ప్రయత్నం పిచ్చి నిర్ణయమంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు సిద్దును దాదాపుగా మర్చి పోయారు. ఇలాంటి సమయంలో ఆయన పేరు చెప్పి విడుదల చేస్తే మాత్రం ఫలితం ఉంటుందా చూడాలి.