Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్ తో పని చేయాలనేది నా బిగ్ డ్రీమ్'

By:  Tupaki Desk   |   26 March 2021 11:50 AM IST
ఎన్టీఆర్ తో పని చేయాలనేది నా బిగ్ డ్రీమ్
X
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఇద్దరు తనయులు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు కాల భైరవలు తండ్రి బాటలోనే సంగీత దర్శకుడిగా రాణిస్తుండగా.. చిన్న కొడుకు శ్రీ సింహా కోడూరి హీరోగా గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నాడు. 'మత్తు వదలరా' సినిమాతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు “తెల్లవారితే గురువారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రేపు ఈ సినిమా విడుదల సందర్భంగా కాలభైరవ మీడియాతో మాట్లాడారు.

''నా తమ్ముడితో వరుసగా రెండు చిత్రాలు చేయటం హ్యాపీగా ఉంది. మూడో సినిమాకు కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్. నా సంగీతం, తన నటన గురించి ఇద్దరం ఒకరికొకరం చర్చించుకుంటాం'' అని కాలభైరవ అన్నారు. రాజమౌళి ఎప్పటి నుంచో మంచి ఇన్ పుట్స్ ఇస్తున్నారని.. తన సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటామని.. తండ్రి కీరవాణి ప్రభావం తన సంగీతంపై ఉంటుందని తెలిపారు. అలాగే ''తారక్ అన్నతో ఎప్పటి నుంచో తమ కుటుంబానికి ఎమోషనల్ బంధం ఉంది. మాకు పెద్దన్నయ్య లాంటి వాడు. నేను పాడిన 'పెనిమిటి సాంగ్‌' తారక్‌ అన్నకు చాలా బాగా నచ్చింది. ఆయన సినిమాకు సంగీతం అందించడం అనేది నా బిగ్ డ్రీమ్'' అని కాలభైరవ తన కోరికను వెలిబుచ్చాడు.