Begin typing your search above and press return to search.

ఖైదీని తెగ పొగిడేసిన దిగ్గజ దర్శకుడు

By:  Tupaki Desk   |   6 Feb 2017 6:59 AM GMT
ఖైదీని తెగ పొగిడేసిన దిగ్గజ దర్శకుడు
X
టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో కె. విశ్వనాథ్ కూడా ఉంటారు. చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నెన్నో చిత్రాలను తెరకెక్కించిన ఈయన.. మెగాస్టార్ చిరంజీవితో రెండు సినిమాలు తీశారు. స్వయంకృషి.. ఆపద్బాంధవుడు అనే రెండు సినిమాలను చిరుతో చేశారు కె. విశ్వనాథ్.

గత రాత్రి ఈయన కోసం ప్రత్యేకంగా మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150ని స్క్రీనింగ్ చేశారు. సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ గా చూసిన.. పూర్తి అయిన తర్వాత మెగాస్టార్ ను తెగ పొగిడేశారు. 'ఇన్నేళ్ల తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చినా చిరంజీవి యాక్షన్ లో అణు మాత్రం కూడా గ్రేస్ తగ్గలేదు. చిరంజీవి మరిన్ని సినమాలు చేయాలి. ఈ వయసులో కూడా ఇంత అద్భుతంగా యాక్టింగ్ చేయగల ఆర్టిస్టులు ఇండస్ట్రీకి దొరకరు' అంటూ ప్రశంసలు గుప్పించారు కె. విశ్వనాథ్.

ఖైదీ నంబర్ 150 చిత్ర దర్శకుడు వివి వినాయక్.. విశ్వనాథ్ తో కలిసి చూశారు. లెజెండరీ డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రశంసలతో వినాయక్ ఉప్పొంగిపోయినట్లు తెలుస్తోంది. చిరంజీవిని అద్భుతంగా చూపించావంటూ.. వినాయక్ ను ప్రత్యేకంగా ప్రశంసించారట విశ్వనాథ్. మాస్ మసాలా ఎంటర్టెయినర్ అయినా.. క్లాసిక్స్ తీసిన డైరెక్టర్ ని మెప్పించిందటే.. వినాయక్ కు ప్రత్యేకంగా అభినందించాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/