Begin typing your search above and press return to search.

అ..ఆ.. నుంచి ఆ దర్శకుడి నిష్క్రమణ?

By:  Tupaki Desk   |   2 Dec 2015 3:30 PM GMT
అ..ఆ.. నుంచి ఆ దర్శకుడి నిష్క్రమణ?
X
అ.. ఆ.. మూవీని శరవేగంగా పూర్తి చేస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి.. అనుకోని షాక్ తగిలింది. నితిన్ - సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ దర్శకుడు కె. విశ్వనాథ్ తప్పుకున్నారు.

దిగ్గజ దర్శకుడు - నటుడు అయిన విశ్వనాథ్ తో పారితోషికం విషయంలో పేచీ వచ్చిన విషయం తెలిసిందే. రోజుకు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ముందుగా మాట్లాడుకున్నా.. తర్వాత ఆయన రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారనే వార్తలొచ్చాయి. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా.. ఇదే అంశంపై ఫైనాన్షియల్ టీం మాత్రం, పెద్దాయనతో కాస్త రఫ్ గా మాట్లాడారట. దీంతో బాధపడ్డ విశ్వనాథ్.. సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పేశారని తెలుస్తోంది.

కె. విశ్వనాథ్ తప్పుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాత్రను సీనియర్ నటుడు గిరిబాబుతో చేయించేందుకు డిసైడ్ అయ్యాడట త్రివిక్రమ్. ఈ మేరకు ఇప్పటికే టాక్స్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అయితే.. విశ్వనాథ్ లాంటి దిగ్గజాన్ని రీప్లేస్ చేయగలగడం కష్టం అని అంటున్నారు. అది నిజమే అయినా.. కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు కదా. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇవి తప్పవు.