Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడి కూతురి పెళ్లితో మెగా అనుబంధం

By:  Tupaki Desk   |   3 March 2020 10:35 AM IST
దర్శకేంద్రుడి కూతురి పెళ్లితో మెగా అనుబంధం
X
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వంద చిత్రాలకు పైగా తెరకెక్కించి ఎంతో మందిని స్టార్‌ హీరోలుగా నిలబెట్టడంతో పాటు ఎంతో మందిని హీరోలుగా పరిచయం చేశాడు. ప్రస్తుతం ఉన్న పలువురు స్టార్‌ హీరోల్లో దాదాపు అంతా కూడా రాఘవేంద్ర రావుతో సినిమాలు చేసిన వారే. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు చిరంజీవికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు చాలా వరకు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఆ అనుబంధంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఇద్దరు మంచి మిత్రులు గా మెలుగుతారు. అందుకే ఇటీవల చిరంజీవి గురించి రాసిన ఒక బుక్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో రాఘవేంద్ర రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి ఒకే ఒక్క విషయంతో క్లారిటీ ఇచ్చేశారు. చిరంజీవితో తాను నిర్మించిన ఒక సినిమాతో వచ్చిన డబ్బులతో తన కూతురు పెళ్లి చేశాను అన్నాడు. ఆ సినిమాకు చిరంజీవి పారితోషికం కూడా తీసుకోకుండా నటించాడు.

ఆర్కే ఫిల్మ్స్‌ బ్యానర్‌ లో చిరంజీవి హీరోగా ఇద్దరు మిత్రులు సినిమాను తెరకెక్కించిన రాఘవేంద్ర రావు ఆ సినిమాతో వచ్చిన లాభాలతో తన కూతురుకు వివాహం చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తన వద్ద ఆస్తులు ఉన్నా కూడా సమయానికి మాత్రం ఆ సినిమా ద్వారానే డబ్బులు వచ్చాయని.. ఆ డబ్బుతోనే తాను కూతురు పెళ్లి చేశాను అన్నాడు. అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా పారితోషికం కూడా తీసుకోకుండా నటించేందుకు ఒప్పుకున్నాడు అంటూ చిరంజీవి పై ప్రశంసల జల్లు కురిపించారు. అలా రాఘవేంద్రరావు కూతురు వివాహం కు చిరంజీవికి అనుబంధం ఏర్పడినది.