Begin typing your search above and press return to search.

మనిషనే నటనకు ప్రాణం తారక్

By:  Tupaki Desk   |   22 Sept 2017 2:58 PM IST
మనిషనే నటనకు ప్రాణం తారక్
X
ఒకరి అభిప్రాయాన్ని చెప్పుకోవాలంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రాధాన వేదికగా మారింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కువగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం చాలానే ఉందని చెప్పాలి. అయితే రీసెంట్ గా విడుదలైన జై లవకుశ సినిమాకి కూడా సోషల్ మీడియాలో చాలా మంచి ప్రశంసలు అందుతున్నాయి. అగ్ర దర్శకులు తారక్ నటనపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

గురువారం విడుదలైన జై లవకుశ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అంతే కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా బాగా నచ్చింది. ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతున్నారు. అదే తరహాలో ఇద్దరు దర్శకులు ఇచ్చిన కాంప్లిమెంట్స్ జై లవకుశకు చాలా బూస్ట్ ని ఇస్తున్నాయి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విధంగా స్పందించారు. ‘‘నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవకుశ అమోఘం.. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని తనదైన శైలిలో ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు.

ఇక అయన శిష్యుడు రాజమౌళి కూడా సినిమా చూడగానే ‘‘నా హృదయం గర్వంతో ఉప్పొంగింది తారక్’’ అని ట్వీట్ చేయడం అందరిని ఆకట్టుకుంది. మొత్తానికి జై లవకుశ గురు శిష్యుల మెప్పు పొందింది. మరి ఇంకెంతమంది ప్రముఖుల ప్రశంసలను అందుకుంటుందో చూడాలి.