Begin typing your search above and press return to search.

నాగ్ సినిమాలో నవాబ్ ఎవరో!!

By:  Tupaki Desk   |   23 Sept 2016 1:00 PM IST
నాగ్ సినిమాలో నవాబ్ ఎవరో!!
X
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓం నమో వెంకటేశాయ. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తి చిత్రం అంటే.. ప్రేక్షకుల్లో ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తూ ఉంటుంది. అన్నమయ్య నుంచి వరుసగా వీరి చిత్రాలన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందడం.. సూపర్ హిట్స్ గా నిలవడం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఆయా పాత్రలకు నటుల ఎంపికలో రాఘవేంద్రరావు చూపించే చాకచక్యం.. ఈ సినిమాల అధ్భుత విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయలో నాగార్జున హథీరాం బాబాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన కథలో ఓ నవాబ్ ఉంటాడు. ఆయన ఈ బాబాను ఓ సారి పరీక్షించాలని నిర్ణయిస్తాడు. ఓ గది నిండా చెరకుగడలతో నింపేసి.. అందులో బాబాను ఉంచి తెల్లారేసరికల్లా తినేయాలని చెబుతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏనుగు రూపంలో వచ్చి.. ఆ చెరకును తినేస్తాడు. ఇది బాబాజీ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన.

అయితే.. ఇప్పుడు ఓం నమో వేంకటేశాయలో ఈ నవాబ్ పాత్రను ఎవరు పోషిస్తారనే సంగతి ఇంకా వెల్లడించలేదు. అన్నమయ్య చిత్రంలో రాజు పాత్రకు మోహన్ బాబు ఎంత వన్నె తీసుకొచ్చాడో చూశాం. అలాగే వెంకటేశ్వరుని ఎంపికలో కూడా వైవిధ్యం చూపిస్తున్న రాఘవేంద్రరావు.. ఇప్పుడు ఎవరిని స్టోరీకి కీలకమైన ఈ నవాబ్ పాత్రలో చూపిస్తారో తెలియాల్సి ఉంది.