Begin typing your search above and press return to search.

కీరవాణి తాళం.. మొదలెట్టేశారు..

By:  Tupaki Desk   |   7 March 2016 11:34 AM GMT
కీరవాణి తాళం.. మొదలెట్టేశారు..
X
కె.రాఘవేంద్రరావు సినిమాలంటే ఇలా ఉంటాయని జనాలకు ఓ లెక్కుంది. నాగార్జున చేసే మూవీస్ పై ఓ అంచనా ఉంది. దర్శకుడేమో గ్లామర్ చిత్రాల ఎక్స్ పర్ట్. ఈయనేమో రొమాంటిక్ కింగ్. ఇలాంటి వీళ్లిద్దరు కలిసి తీస్తున్న సినిమాలు మాత్రం పూర్తి భక్తితో ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇప్పటికే అన్నమయ్య - శ్రీరామదాసు - షిర్డీ సాయిబాబా వంటి భక్తి రస చిత్రాలు వీరి కాంబినేషన్ రాగా.. ఇప్పుడు మరో సినిమాకి కూడా శ్రీకారం చుట్టారు.

అదే తిరుమల వెంకన్న భక్తుడు హథీరాం బాబా. ఈయన జీవిత కథతో తీయబోతున్న చిత్రంలో నాగార్జున బాబా రోల్ ను చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. రీసెంట్ గా మ్యూజిక్ సిట్టింగులను కూడా స్టార్ట్ చేసేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో సోషల్ నెట్ వర్క్స్ లో సందడి చేస్తోంది.

త్వరలో సంగీత దర్శకత్వం నుంచి తప్పుకుంటానని కీరవాణి గతంలోనే ప్రకటించారు. బహుశా అది ఈ హథీరాంబాబా తర్వాతే అనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకూ తాను రూపొందించిన ప్రతీ ఆల్బంను.. పదిలంగా దాచుకునేలా రూపొందించిన కీరవాణి.. తిరుమల శ్రీనివాసునిపై రూపొందించే పాటలను కూడా ఎంతో హృద్యంగా రూపొందించాలని నిర్ణయించుకున్నారట.