Begin typing your search above and press return to search.

ఇన్ స్టాలో ప్ర‌వేశించిన లేడీ డ్రాకులా.. క్ష‌ణాల్లోనే..!

By:  Tupaki Desk   |   1 Sept 2021 5:00 AM IST
ఇన్ స్టాలో ప్ర‌వేశించిన లేడీ డ్రాకులా.. క్ష‌ణాల్లోనే..!
X
స్టార్ హీరోయిన్ జ్యోతిక సోష‌ల్ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రమ్.. ట్విట్ట‌ర్ అంటూ ఎలాంటి ఖాతాల్లో లేరు. సెల‌క్టివ్ గా సినిమాలు చేయ‌డం.. ఎక్కువ స‌మ‌యాన్ని కుటుంబానికి కేటాయించ‌డం.. ఇల్లు.. కుటుంబ‌మే ఆమె జీవితంగా సాగింది. సినిమా విశేషాలు.. వ్య‌క్తిగ‌త విష‌యాలు లాంటివి మీడియాకిగానీ.. అభిమానుల‌కు గానీ అరుదైన సంద‌ర్భాల్లోనే షేర్ చేస్తుంటారు. ఇదంతా ఇప్ప‌టివ‌ర‌కూ. కానీ సోష‌ల్ మీడియాల హ‌వా సాగుతున్న ఈ ట్రెండ్ లో తాజాగా జ్యోతిక ఇన్ స్టాలో అకౌంట్ ఓపెన్ చేసారు. దీంతో జ్యోతిక పాలోవ‌ర్స్ నిమిషాల్లోనే భారీగా పెరిగారు. జ్యోతిక ఖాతా తెరిచిన 45 నిమిషాల్లోనే 1.2 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ చేరారు.

ఇది నిజంగా షాకింగ్. నిమిషాల్లోనే ఇంత మంది ఫాలోవ‌ర్స్ రావ‌డం అంటే చిన్న విష‌యం కాదు. పెద్ద స్టార్ డ‌మ్ ఉన్న‌ హీరోల‌కే ఇలాంటి రేర్ ఫీట్ సాధ్యం. అలాంటి అరుదైన రికార్డుని జ్యోతిక సాధించ‌డం విశేషం. జ్యోతిక హీరోయిన్ గా ఎక్కువ సినిమాల్లో న‌టించ‌లేదు. మేక‌ప్ వేసుకున్న స‌మ‌యంలో గ్లామ‌ర్ హీరోయిన్ గాను రాణించ‌లేదు. ఆమె సినిమాల ప‌ట్ల చాలా సెల‌క్టివ్ గా వెళ్లేవారు. సూర్య‌ని పెళ్లాడిన త‌ర్వాత సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఈ మ‌ధ్య కాలంలోనే మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మ‌రింత సెల‌క్టివ్ గా ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో న‌టిస్తున్నారు. అయితే భ‌ర్త సూర్య‌కి ఉన్న ఇమేజ్ కార‌ణంగా జ్యోతిక అనుచ‌ర గ‌ణం పెరిగింద‌ని చెప్పొచ్చు.

సూర్య‌కి..తెలుగు-త‌మిళ్ భాష‌ల్లో చాలా మంది ఫాలోవ‌ర్స్ .. అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. అలాగే సూర్య‌- కార్తీ కి ఉన్న అసాధార‌ణ ఫాలోయింగ్ దృష్ట్యా.. అది త‌న‌కు ప్ల‌స్ అవుతోంది. ఇలాంటి క్రేజ్ కార‌ణంగా జ్యోతిక నిమిషాల్లోనే ఇన్ స్టాలో ఈ ఫీట్ ని సాధించింద‌ని అంచ‌నా వేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన అనంత‌రం .. జాతీయ ప‌తాక‌న్ని ప‌ట్టుకుని దిగిన ఫోటోని ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసారు. ఇదే జ్యోతిక మొట్ట మొద‌టి పోస్ట్. స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా క‌శ్మీర్ లో దిగిన ఫోటో అని ఆమె వెల్ల‌డించారు.

చంద్ర‌ముఖి త‌ర్వాత మ‌ళ్లీ ఆ జోష్ లేదు

లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్నారు జ్యోతిక‌. చంద్ర‌ముఖిగా ఇప్ప‌టికీ తెలుగు వారి గుండెల్లో నిలిచి ఉన్న ఈ ట్యాలెంటెడ్ న‌టి.. త‌మిళ స్టార్ హీరో సూర్య‌ను పెళ్లాడి ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్లి అయినా ఇంకా అదే ఎన‌ర్జీతో క‌థానాయిక‌గానూ రాణిస్తున్నారు. ఇటీవ‌ల జ్యోతిక న‌టించిన సినిమాలు వ‌రుస‌గా తెలుగులోనూ రిలీజవుతున్నాయి. జ్యోతిక న‌టించిన ర‌చ్చాసి త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో హెడ్ మిస్ట్రెస్ గా క‌లెక్టర్ స్థాయి అధికారిని ప్రేరేపించే పాత్ర‌లో క‌నిపించి ప్ర‌శంస‌లు అందుకున్నారు.

జ్యోతిక వ‌రుస‌గా 2డి ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో సినిమాలు చేస్తున్నారు. రాజ‌కీయ సామాజిక‌‌ అవ్య‌వ‌స్థ‌కు సంబంధించిన అవ‌స్థల‌ను ప్ర‌శ్నించే కాన్సెప్ట్ ల్ని ఎంచుకుని జ్యోతిక నటిస్తున్నారు. జ్యోతిక న‌టించిన‌ పొన్ మ‌గ‌ల్ వంద‌ల్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఉడ‌న్ పిర‌ప్పే అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇవ‌న్నీ 2డి ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ లో తెర‌కెక్కాయి. అమెజాన్ స‌హా ప‌లు ఓటీటీల‌తో సూర్య భారీ డీల్స్ కుదుర్చుకుని ఒరిజిన‌ల్ కంటెంట్ ని అందిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.