Begin typing your search above and press return to search.

మంచు ల‌క్ష్మి నేహాధూపియా రేంజులో?

By:  Tupaki Desk   |   4 Aug 2018 1:30 AM GMT
మంచు ల‌క్ష్మి నేహాధూపియా రేంజులో?
X
మంచు కాంపౌండ్‌ లో మేటి ప్ర‌తిభావ‌నిగా మంచు ల‌క్ష్మి పేరు తెచ్చుకుంది. త‌న‌ని ల‌క్ష్మీ అని పిలిచే కంటే `ల‌క్ష్మీ బాంబ్` అని పిలిచేందుకే అభిమానులు ఇష్ట‌ప‌డ‌తారు. మంచు వార‌మ్మాయి ఒక క్రాక‌ర్‌. త‌న‌లో అంత ఫైర్ ఉంది. స‌రైన అవ‌కాశం రావాలే కానీ నిరూపించుకునే స‌త్తా ఉంద‌ని ఇటీవ‌లే `వైఫ్ ఆఫ్ రామ్‌` పెర్ఫామెన్స్ నిరూపించింది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఈ సినిమా ఆశించినంత విజ‌యం సాధించ‌క‌పోయినా ల‌క్ష్మీ న‌ట‌న‌కు మాత్రం ఎవ‌రూ పేరు పెట్ట‌లేదు. పెర్ఫామ‌ర్‌ గా త‌న స్థాయిని ల‌క్ష్మీ కాపాడుకోవ‌డంపై క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లొచ్చాయి.

అదంతా అటుంచితే మంచువార‌మ్మాయి త‌మిళంలో ఓ క్రేజీ సినిమాలో న‌టిస్తోంది. ఇందులో జ్యోతికతో క‌లిసి మెరుపులు మెరిపించ‌బోతోందిట‌. ఈ సినిమాలో మ‌ల‌యాల హిట్ సాంగ్ జిమ్మిక్కి క‌మాల్‌`(మోహ‌న్‌లాల్ - వేలిప‌డింటే పుస్త‌కం) ని రీమిక్స్ చేయ‌నున్నార‌ట‌. ఈ పాట కూడా శ్రీ‌దేవి `హ‌వా హ‌వాయి` త‌ర‌హాలో బ్లాక్‌ బ‌స్ట‌ర్ సాంగ్‌. ఈ రీమిక్స్ పాట‌కు జ్యోతిక‌- ల‌క్ష్మీ మంచు క‌లిసి స్టెప్పులు వేయ‌నున్నారు. ఆ స్టిల్ ఒక‌టి నెట్‌ లో ఇప్ప‌టికే జోరుగా వైర‌ల్ అవుతోంది. అంతేకాదు ఈ చిత్రంలో జ్యోతిక ప‌ని చేసే ఆఫీస్‌ లో బాస్‌ గానూ న‌టిస్తోంది ల‌క్ష్మీ మంచు.

అస‌లింత‌కీ ఈ సినిమా ఏదైనా సినిమాకి రీమేకా? అంటే.. అవున‌నే తెలుస్తోంది. ఇటీవ‌లే విద్యాబాల‌న్ క‌థానాయిక‌గా న‌టించిన బాలీవుడ్ బ్లాక్‌ బ‌స్ట‌ర్ `తుమ్హారీ షులూ` చిత్రాన్ని త‌మిళంలో జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ల‌క్ష్మీ మంచు ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టిస్తోంది. ఇక ఈ సినిమాలో బాస్ పాత్ర‌లో ల‌క్ష్మీ మంచు ఆహార్యం నేహా ధూపియా రేంజులో బోల్డ్‌ గా ఉంటుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ల‌క్ష్మి పాత్ర గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మిస్ట‌ర్ ఇండియా `హ‌వా హ‌వాయీ..` సాంగ్‌ లో శ్రీ‌దేవి పెర్ఫామెన్స్‌ ను ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ పాట‌ను విద్యాబాల‌న్ సినిమాలో రీమిక్స్ చేసినా సేమ్ పాట‌ను జ్యోతిక‌- ల‌క్ష్మి మంచు కోసం ఎంపిక చేసుకోక‌పోవ‌డానికి కార‌ణ‌మేంటో?