Begin typing your search above and press return to search.

ఆ లెజెండ్ జ్యో అచ్యుతానంద‌ను పొగిడాడు

By:  Tupaki Desk   |   15 Sep 2016 2:32 PM GMT
ఆ లెజెండ్ జ్యో అచ్యుతానంద‌ను పొగిడాడు
X
అచ్చ తెలుగు సినిమా.. మ‌న‌సు త‌లుపు త‌ట్టే సినిమా.. న‌వ్వించి క‌వ్వించి క‌దిలించే సినిమా.. ఇంకా చాలా ఉప‌మానాలే విన్నాం ‘జ్యో అచ్యుతానంద’ గురించి. ఎంద‌రో సెల‌బ్రెటీలు.. గొప్ప గొప్ప వాళ్లు ఈ సినిమా గురించి మంచి మాట‌లు చెప్పారు. తాజాగా గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం సైతం ఈ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తెలుగు సినిమాల గురించి చాలా అరుదుగా మాట్లాడే బాలు.. ఈ సినిమా చూసి ముగ్ధుడైపోయి ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్ కు ఓ వాయిస్ మెసేజ్ పెట్టార‌ట‌. చెన్నైలో ఉండే బాలు అక్క‌డే ఈ సినిమా చూసి.. అవ‌స‌రాల‌కు అభినంద‌న సందేశం పంపించారు.

బాలు త‌న‌ను అభినందించిన విష‌యాన్నిఅవసరాల తన ఫేస్‌ బుక్ పేజీలో షేర్ చేశాడు. ‘‘నిన్న రాత్రి నాకు ఓ గోల్డెన్‌ వాయిస్‌ నోట్‌ వచ్చింది. సినిమా గురించి ప్రశంసిస్తూ నాలుగు మాటలు మాట్లాడారు. నేను నమ్మలేకపోయాను. మాట్లాడిన వాక్యాలన్నీ సినిమా గురించే. చాలా సంతోషంగా ఫీలయ్యాను’’ అని అవసరాల పేర్కొన్నాడు. బాలసుబ్రమణ్యం ఫొటోను కూడా అవ‌స‌రాల షేర్‌ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు అమెరికాలోనూ ‘జ్యో అచ్యుతానంద’ చ‌క్క‌టి వ‌సూళ్లు రాబ‌డుతోంది. బ‌య్య‌ర్ల‌కు ఇది సేఫ్ వెంచ‌ర్ అవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఫుల్ ర‌న్లో ఈ చిత్రం రూ.10 కోట్ల‌కు పైనే షేర్ క‌లెక్ట్ చేసే అవ‌కాశ‌ముంది.