Begin typing your search above and press return to search.

తెలంగాణా యాస‌లో జ్వాలారెడ్డి సంపుడేనంట‌గా!

By:  Tupaki Desk   |   19 March 2021 7:30 AM GMT
తెలంగాణా యాస‌లో జ్వాలారెడ్డి సంపుడేనంట‌గా!
X
మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నాను ఇంత‌కుముందెన్న‌డూ ఇంత ఇదిగా ‌చూడ‌లేదు. త‌న లైఫ్ లో అరుదైన క్ష‌ణాల్ని ఆస్వాధిస్తూ ఆ సంద‌ర్భాల్ని ఇలా సోష‌ల్ మీడియాల్లో ప్ర‌మోట్ చేసుకుంటూ త‌మ్మూ చేస్తున్న సంద‌డి మామూలుగా లేదు. టాలీవుడ్ లో ఆల్మోస్ట్ మిల్కీ బ్యూటీ కెరీర్ ముగిసిన‌ట్టే అంటూ క‌థ‌నాలు వేడెక్కించిన క్ర‌మంలో అన్నిటికీ స‌మాధాన‌మిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో వేడి పెంచేసింది త‌మ‌న్నా.

2020-21 సీజ‌న్ లో వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయిపోయింది. గోపీచంద్ స‌ర‌స‌న న‌టించిన‌ సీటీమార్ రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా.. గుర్తుందా శీతాకాలం అనే చిత్రంలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. మ‌రోవైపు ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి రిలీజ్ కి ప్లాన్ చేస్తోంద‌ట‌. ఇవేగాక‌ ప‌లు ప్రాజెక్టులో మిల్కీ క్యూలో ఉన్నాయి.

నిన్న‌నే త‌నకు తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇచ్చి కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసుకోనంత లైఫ్ ని ఇచ్చిన గురూజీ శేఖ‌ర్ క‌మ్ముల‌ను కలుసుకున్న త‌మ‌న్నా ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యింది.`హ్యాపీడేస్` ని ఇచ్చిన క‌మ్ముల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ.. అత‌డు తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరి కి ప్ర‌మోష‌న్ చేసింది.

తాజాగా త‌న‌కు ప‌లు క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చిన మ‌రో ద‌ర్శ‌కుడు సంప‌త్ నందితో క‌లిసి అంతే అల్ల‌ర‌ల్ల‌రి చేస్తూ నెటిజ‌నుల్ని ఆక‌ర్షించింది. ``న‌న్ను న‌మ్మి జ్వాలారెడ్డి పాత్ర‌లో అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్. ఈ పాత్ర‌లో న‌టిస్తూ ప‌తాక స్థాయిలో ఫ‌న్ ని ఆస్వాధించాం. గొప్ప అనుభ‌వ‌మిది.. సీటీమార్ లో తెలంగాణ యాస‌ను ప్ర‌య‌త్నించాను`` అని త‌మ‌న్నా వెల్ల‌డించారు. జ్వాలారెడ్డి పాత్ర‌కు డ‌బ్బింగ్ పూర్తి చేసిన సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నందితో క‌లిసి ఇలా సెల‌బ్రేష‌న్ మూడ్ లో క‌నిపించారు త‌మ‌న్నా. జ్వాలా రెడ్డిగా తెలంగాణ యాస‌లో త‌మ‌న్నా అద‌ర‌గొట్టేస్తుంద‌ట‌. ఇక ఈ మూవీలో లారీ న‌డిపించి మిల్కీ ఇచ్చే షాక్ మామూలుగా ఉండ‌ద‌ని ఇంత‌కుముందు రివీలైన వీడియో వెల్ల‌డించింది. ఏప్రిల్ 2న సీటీమార్ రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.