Begin typing your search above and press return to search.

జ్వాలా గుత్తాతో హీరో విష్ణు విశాల్ పెళ్లి ఫిక్స్

By:  Tupaki Desk   |   21 March 2021 5:30 PM GMT
జ్వాలా గుత్తాతో హీరో విష్ణు విశాల్ పెళ్లి ఫిక్స్
X
తమిళ నటుడు విష్ణు విశాల్ త్వరలో ఏస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తాని వివాహం చేసుకోబోతున్నారు. అత‌డు న‌టించిన‌ అర‌ణ్య రిలీజ్ కి వ‌స్తున్న క్ర‌మంలో హైదరాబాద్ లో జ‌రిగిన‌ ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో స‌ద‌రు యువ‌హీరో స్వ‌యంగా ఈ ప్రకటన చేశారు.

గత కొన్ని నెలలుగా విష్ణు విశాల్ - జ్వాలా గుత్తా అనేక సందర్భాల్లో కలిసి కనిపించారు. హైదరాబాద్ ‌లోని జ్వాలా సోదరి వివాహానికి ఆయన హాజరయ్యారు. అర‌ణ్య వేడుక‌లో విష్ణు విశాల్ మాట్లాడుతూ, ..“అర‌ణ్య షూటింగ్ స‌మ‌యంలో జ్వాలా గుత్తా నాకు పెద్ద స‌హ‌కారిగా ఉంది. షూటింగ్ స్పాట్ లోనూ ఉంది. మేము వివాహం చేసుకోబోతున్నాం. త్వరలో తేదీని ప్రకటిస్తాం. నేను త్వరలో తెలుగింటి అల్లుడు కాబోతునున్నాను” అని వెల్ల‌డించారు.

విష్ణు విశాల్ కోలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నారు. ఇప్పుడు క‌ద‌న్ (ఆరణ్య) విజయంపై విష్ణు విశాల్ పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఇందులో రానాతో క‌లిసి ఒక హీరోగా న‌టించారు. తన తదుపరి మూడు తమిళ చిత్రాలను కూడా తెలుగులో కూడా విడుదల చేయబోతున్నానని విష్ణు విశాల్ తెలిపారు.