Begin typing your search above and press return to search.

సెలీనా అభిమానులకు బీబర్ షాక్

By:  Tupaki Desk   |   9 July 2018 4:22 PM IST
సెలీనా అభిమానులకు బీబర్ షాక్
X
జస్టిన్ బీబర్.. సంగీత ప్రపంచంలో దూసుకొచ్చిన స్టార్ సింగర్.. హుషారెత్తించే పాటలతోపాటు , ప్రేమ వ్యవహారాలతోనూ ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. త్వరలోనే ఇతడు వివాహ బంధంలో అడుగుపెట్టడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. కొత్త గర్ల్ ఫ్రెండ్ మోడల్ హేలీ బోల్డ్ విన్ తో బీబర్ ఎంగేజ్ మెంట్ జరిగినట్లుగా అతడి సన్నిహితులు మీడియాకు తెలిపారు. ‘బీబర్ జీవితంలో మొదలుకాబోతున్న కొత్త అధ్యాయం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..’ అంటూ బీబర్ తండ్రి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.హేలీ తండ్రి కూడా ‘బేబీ - హెచ్ బీ హృదయపూర్వకంగా కోరుకున్నదే జరుగుతోంది’ అంటూ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

బీబర్ ఎంగేజ్ మెంట్ విషయం తెలియగానే అభిమానులు షాక్ అయ్యారు. కొన్నేళ్లుగా స్టార్ సింగర్ సెలీనా గోమెజ్ తో లవ్ ఎఫైర్ నడిపిన బీబర్ 2017 అక్టోబర్ లో విడిపోయాడు. అంతుకుముందు సంవత్సరం 2016లో ఇదే హేలీతో ఎంగేజ్ మెంట్ చేసుకొని మరీ విడిపోయి స్వీట్ షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం బీబర్ -హేలీ జంట బహమాస్ టూర్ లో ఉన్నట్టు సమాచారం. వీరి జంట అయినా పెళ్లి పీటలు ఎక్కుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే..