Begin typing your search above and press return to search.

సీత కోసం వేచి చూస్తున్న రామ్ లానే ఉన్నాడు!

By:  Tupaki Desk   |   21 April 2021 2:30 PM GMT
సీత కోసం వేచి చూస్తున్న రామ్ లానే ఉన్నాడు!
X
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ జాబితాలో రాపో అలియాస్ రామ్ పోతినేని పేరు ఇప్పుడు ప్రైమ్ మెంబ‌ర్ షిప్ పొందింది. గ‌త ఏడాది నితిన్ - రానా లాంటి యంగ్ హీరోలు త‌మ‌కు న‌చ్చిన యువ‌తుల‌ను పెళ్లాడేయ‌గా.. ఇంకా వేచి చూస్తున్న బ్యాచిల‌ర్స్ జాబితాలో ప్ర‌భాస్ - రామ్ - అఖిల్ వంటి వారి పేర్లు ఉన్నాయి.

అదంతా స‌రే కానీ.. రామ్ పెళ్లెప్పుడు? అంటే పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ నుంచి కానీ...రాపో నుంచి కానీ స‌రైన ఆన్స‌ర్ లేదు. ఇంట్లో వాళ్లు తొంద‌ర పెడుతున్నార‌ని కానీ ఇంకా టైమ్ ప‌డుతుంద‌ని రాపో చెబుతున్నా.. దానిపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. ఇక‌పోతే రామ్ పోతినేని అభిమానులు తాజాగా ఓ ఫోటోని శ్రీ‌రామ‌న‌వ‌మి లుక్ ఇదీ అంటూ వైర‌ల్ చేస్తున్నారు.

చూడ‌టానికి `సీత కోసం వేచి చూస్తున్న రామ్`లానే ఉన్నాడు. చుక్క‌ల డిజైన్ తో ఈ వంగ పువ్వు రంగు కుర్తాలో శ్రీ‌రామ‌చంద్రుడినే త‌ల‌పిస్తున్నాడు. ప‌ర్ఫెక్ట్ శ్రీ‌రామ‌న‌వ‌మి లుక్ ఇది.. డౌట్ లేదు!! అని ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. అయితే ఇది ఫ్రెష్ ఫోటోషూట్ కాదు. త్రోబ్యాక్ ఫోటో. రెడ్ సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో రామ్ ఈ లుక్ తో క‌నిపించారు. అత‌డి సోష‌ల్ మీడియాల్లోనూ ఈ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. అయినా కానీ ఇది పండ‌గ లుక్ అన‌డంలో సందేహ‌మేం లేదు. ఇక‌పోతే సంక్రాంతి బ‌రిలో రెడ్ ఫ్లాప‌య్యాక‌.. ఇప్పుడు రెట్టించిన క‌సితో రామ్ ప‌ని చేస్తున్నారు. ప్ర‌స్తుతం లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో రాపో పోలీసాఫీస‌ర్ గా క‌నిపిస్తారు.