Begin typing your search above and press return to search.

కేవ‌లం అన‌సూయ స్పెష‌ల్ సాంగ్ కోస‌మే వ‌స్తున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   23 March 2021 9:00 AM IST
కేవ‌లం అన‌సూయ స్పెష‌ల్ సాంగ్ కోస‌మే వ‌స్తున్నార‌ట‌!
X
బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం గురించి తెలిసిందే. యాంక‌ర్ గా న‌టిగా స‌త్తా చాటుతున్న ఈ బ్యూటీ సోష‌ల్ మీడియా క్వీన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. అందానికి అందం చొర‌వ‌తో దూసుకుపోతున్న నేటిత‌రం యాంక‌ర్ కం న‌టి అనసూయ‌.

రంగ‌మ్మ‌త్త‌గా పాపుల‌ర‌య్యాక‌.. త‌న‌కు ఉన్న క్రేజును క్యాష్ చేసుకుంటూ ఇటీవ‌ల వ‌రుస సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నారు. మ‌రోవైపు బుల్లితెర అవ‌కాశాల్ని విడిచిపెట్ట‌డం లేదు. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనే బెస్ట్ యాంక‌ర్ కం న‌టిగా దూసుకుపోతోంది.

ఇటీవ‌లే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో పైన ప‌టారం లోన లొటారం పాట‌లో అద్భుత నృత్యంతో అన‌సూయ ఆక‌ట్టుకున్నారు. ఇది స్పెష‌ల్ రోల్ స్పెష‌ల్ సాంగ్ అని అన‌సూయ అన్నారు. నేటి జ‌న‌రేష‌న్ లో ఇంత వైబ్రేంట్ గా వ‌చ్చిన వేరొక యాంక‌ర్ న‌ర్త‌కి ఎవ‌రూ లేరన్న చ‌ర్చా సాగుతోంది.

ఇక అన‌సూయ రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో అంతర్జాలం షేక‌వుతోంది. కేవ‌లం త‌న అందంతో బౌన్స‌ర్ వేసి జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే ప్ర‌తిభ అన‌సూయ సొంత‌మ‌ని ప్రూవైంది. ఆ ఒక్క పాట కోస‌మే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నామ‌ని ఓ లైవ్ చాట్ లో చెబుతున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు.