Begin typing your search above and press return to search.

జూరాసిక్ వరల్డ్: 1 బిలియన్ వసూళ్లు

By:  Tupaki Desk   |   8 July 2018 10:40 AM GMT
జూరాసిక్ వరల్డ్: 1 బిలియన్ వసూళ్లు
X
రాక్షస బల్లుల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిందే.. ఆ పరంపరలోనే వచ్చిన ‘జురాసిక్ పార్క్ : ఫాలెన్ కింగ్ డమ్’ మూవీ విడుదలై ఐదువారాలు పూర్తి చేసుకుంది. రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. 1 బిలియన్ వసూళ్లు సాధించిన 35వ సినిమాగా నిలిచింది.

ఈ మూవీ యూఎస్ ఏ దేశంలోనే రెండు వారాల్లో 300 మిలియన్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.005 బిలియన్ల డాలర్లు వసూలు చేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కిస్టోఫర్ దర్శకత్వంలో వచ్చిన ‘ది డార్క్ నైట్’ మూవీని జురాసిక్ పార్క్ వెనక్కి నెట్టింది. ది డార్క్ నైట్ సినిమా 1.004 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

జూరాసిక్ పార్క్ తాజా సినిమా జూన్ 6న రిలీజ్ అయ్యింది. చూస్తుంటే ఈ సినిమా వచ్చేవారంలో 1.12 బిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చేవారం జూలై 13న ఈ సినిమాను జపాన్ లో విడుదల చేయడానికి నిర్ణయించారు. ఈ సిరీస్ కు ముందు వచ్చిన జురాసిక్ పార్క్ మూవీ జపాన్ లో 74 మిలియన్ల కలెక్షన్లు వసూలు చేసింది.

జురాసిక్ పార్క్ : ఫాలెన్ కింగ్ డమ్ మూవీని దాదాపు 180 మిలియన్లకు పైగా ఖర్చు చేసి తీశారు. విడుదలైన నెలలోనే ఈమూవీ బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం విశేషంగా చెప్పవచ్చు.