Begin typing your search above and press return to search.

చెత్త సినిమా.. 9 వేల కోట్లు

By:  Tupaki Desk   |   25 July 2015 9:50 AM GMT
చెత్త సినిమా.. 9 వేల కోట్లు
X
జురాసిక్ పార్క్ అప్పట్లో పెద్ద సంచలనం. ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన ఈ సినిమాకు తర్వాత రెండు సీక్వెల్స్ వచ్చాయి. 2001లో వచ్చిన జురాసిక్ పార్క్-3 అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ఇక ఈ సిరీస్ కు తెరపడిపోయినట్లే అనుకున్నారు. కానీ 14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జురాసిక్ వరల్డ్ పేరుతో కొత్త పార్ట్ వచ్చింది. సినిమా చూసి క్రిటిక్స్ చెత్త అన్నారు. ఏముంది ఇందులో కొత్తదనం.. ఎప్పుడూ ఒకటే కథా అని పెదవి విరిచారు. కానీ జనాలు మాత్రం విరగబడి చూశారు. రికార్డుల మోత మోగించి హాలీవుడ్ ట్రేడ్ పండితుల్ని విస్మయానికి గురిచేసిందీ సినిమా. హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లో జురాసిక్ వరల్డ్ మూడో స్థానానికి చేరుకోవడం విశేషం.

తొలి రెండు స్థానాల్లో అవతార్, టైటానిక్ ఉన్నాయి. ఐతే ఆ రెండు సినిమాలకు అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. అవి రెండూ గొప్ప సినిమాలని జనాలు, క్రిటిక్స్ ఒప్పుకున్నారు. కానీ జురాసిక్ వరల్డ్ కు చాలా విమర్శలు వచ్చినా భారీ వసూళ్లు రాబట్టడం విశేషం. ఫుల్ రన్ లో ఈ సినిమా 1.524 బిలియన్ల (రూ.9 వేల కోట్లకు పైగా) వసూళ్లు రాబట్టింది. అవతార్ 2.7 బిలియన్ డాలర్లతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటే.. టైటానిక్ 2.18 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. జురాసిక్ వరల్డ్ ది మూడో స్థానం. ఐతే ఫుల్ రన్ కలెక్షన్లలో అవతార్, టైటానిక్ ముందున్నా ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లలో జురాసిక్ వరల్డ్ దే రికార్డు. నాలుగు రోజుల ఫస్ట్ వీకెండ్లో ఆ సినిమా 500 మిలియన్లు (రూ.3200 కోట్లు) వసూలు చేయడం విశేషం. ఈ కలెక్షన్ల వర్షం చూశాక నిర్మాతలకు జురాసిక్ పార్క్ సిరీస్ లో మరో పార్ట్ తీయాలన్న కోరిక మొదలైంది. సిరీస్ లో ఐదో భాగం 2018లో విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించారు.