Begin typing your search above and press return to search.
వర్మకు టిక్ టాక్ స్టార్ హ్యాండిచ్చాడా?
By: Tupaki Desk | 6 July 2020 5:30 AM GMT`పవర్ స్టార్` టైటిల్ ప్రకటనతోనే ఆర్జీవీపై పవన్ అభిమానుల కన్ను పడింది. వివాదాల వర్మ ఈ సినిమా తీయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్న పంతం పవన్ అభిమానుల్లో అంతకంతకు రెట్టించిందని ఓ గుసగుస. పైగా ఒక టిక్ టాక్ స్టార్ ని పెట్టి సినిమా తీసి తమ అభిమాన హీరోని అవమానిస్తారా? అంటూ ఫ్యాన్స్ గరంగరంగానే ఉన్నారు.
అసలింతకీ ఈ టిక్ టాక్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చాడు? అని పవన్ అభిమానులు సహా లోకం మొత్తం ఆరా తీసింది. `పవర్ స్టార్` మూవీ కోసం ఆర్జీవీ ఎంపిక చేసుకున్న ఆ టిక్ టాక్ స్టార్ పేరు చల్లకోటి నరేష్. భద్రాచలం టౌన్ లో ఉంటాడు. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. చూడ్డానికి పవర్ స్టార్ లా ఉంటాడు. దీంతో తన అభిమాన హీరోను అనుకరిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసే ఆర్జీవీ ఛాన్సిచ్చాడు. ఇన్నాళ్లు పవన్ లా ఉండడం వల్ల ఫేమస్ అయిన అతడు ఆర్జీవీ సినిమాతో ఇంకెంత ఫేమస్ అయిపోతాడోనని అనుకున్నారంతా.
కానీ ఇంతలోనే ఊహించని ట్విస్టు. సదరు టిక్ టాక్ స్టార్ ఇప్పుడు ఆర్జీవీ సినిమా చేయనని అంటున్నాడట. ఆ మూవీ నుంచి ఆల్మోస్ట్ తప్పుకున్నట్టేనని ప్రచారమవుతోంది. అయితే ఇది నిజమా? ఒకవేళ టిక్ టాక్ స్టార్ చల్లకోటి నరేష్ తప్పుకుంటే వర్మ ఇంకెవరిని ఎంపిక చేసుకుంటారు? అన్నది సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా ఎవరి మాటా వినని ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా తీసి తీరతారనే అంతా భావిస్తున్నారు. పవర్ స్టార్ గా పవన్ ఎదిగిన తీరు.. అటుపై పవనిజం పేరుతో అభిమానం.. జనసేన పార్టీతో రాజకీయారంగేట్రం వీటన్నిటినీ తెరపై చూపిస్తాడా లేదా? అన్నది వర్మనే స్వయంగా చెప్పాల్సి ఉంటుంది.