Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ః నేను గానీ గరిట గానీ తిప్పానంటే

By:  Tupaki Desk   |   4 April 2021 8:00 PM IST
జూనియర్ ఎన్టీఆర్ః నేను గానీ గరిట గానీ తిప్పానంటే
X
వెండి తెర‌పై హీరోలు ఎలా ఉంటారో ప్రేక్ష‌కులు తెలుసు. క‌త్తులు చేత‌ప‌ట్టి విల‌న్ల‌ను తుత్త‌నియ‌లు చేస్తారు.. రౌద్రాది ర‌సాల‌ను అల‌వోక‌గా ప‌లికిస్తారు. అభిమానుల‌తో జేజేలు అందుకుంటారు. మ‌రి, ఇంట్లో ఎలా ఉంటారు? ఇది స‌న్నిహితుల‌కు త‌ప్ప‌, మిగిలిన వారెవ్వ‌రికీ అంత‌గా తెలిసే ఛాన్స్ లేదు.

షూటింగులు ఉన్న‌ప్పుడు య‌మా బిజీగా ఉంటారు.. టైమ్ టూ టైమ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని వెళ్లిపోతారు. మ‌రి, ఖాళీగా ఉన్న‌ప్పుడు ఏం చేస్తారంటే.. ఇష్ట‌మైన వ్యాప‌కాల్లో మునిగిపోతారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా అంతే. అయితే.. ఆయ‌న‌కు ఇష్ట‌మైన వ్యాప‌కాల్లో వంట చేయ‌డం ప్ర‌త్యేక‌మైన‌ది.

కుకింగ్‌ చేయ‌డం ఇంట్ర‌స్ట్ మాత్ర‌మే కాదు.. అందులో చేయి తిరిగిన‌వాడు. ఎలాంటి డిష్ అయినా ప‌ర్ఫెక్ట్ గా ఫినిష్ చేసేస్తాడు. అంద‌రూ ఇష్ట‌ప‌డే బిర్యానీని అద్ద‌ర‌గొట్టేస్తాడు జూనియ‌ర్‌. మ‌ట‌న్ బిర్యానీ వండాడంటే.. గిన్నె కూడా నాకేయాల్సిందే. అంత సూప‌ర్బ్ గా కుక్ చేస్తాడు.

సినిమా సెట్స్ లో కావొచ్చు.. బ‌య‌ట కావొచ్చు.. జూనియర్ చాలా స‌ర‌దాగా ఉంటాడు. అందుకే.. ఎన్టీఆర్ ఇల్లూ త‌ర‌చూ బంధువులు, స్నేహితుల‌తో నిండిపోతూ ఉంటుంది. వీలు కుదిరితే.. వారంద‌రికీ త‌నే స్వ‌యంగా వండిపెడ‌తాడ‌ట‌. కే...క అంటూ వాళ్లు ఇచ్చే ఎక్స్ ప్రెష‌న్స్ చూసి థ్రిల్ అయిపోతాడ‌ట‌.

అయితే.. కేవ‌లం వండ‌డ‌మే కాదు.. కుమ్మేయ‌డంలోనూ ముందే ఉంటాడు. మ‌ట‌న్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటాడు. దీంతోపాటు రొయ్య‌ల తో చేసిన బిర్యానీ కూడా మ‌హాఇష్టం. చికెన్ రుచులు కూడా ఆస్వాదిస్తాడు. అయితే.. హీరోగా త‌న ఫిట్ నెస్ కాపాడుకోవాలి కాబ‌ట్టి.. మితంగానే ఆర‌గింస్తుంటాడు.